Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salad Side Effects: బరువు తగ్గుతామని సలాడ్ ఎక్కువగా తినేస్తున్నారా ? ప్రమాదమే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసుకోండి..

ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఎక్కువగా వేధిస్తున్న సమస్య ఉబకాయం. అధిక బరువుతో చాలా మంది ఇబ్బందిపడుతున్నారు.

Salad Side Effects: బరువు తగ్గుతామని సలాడ్ ఎక్కువగా తినేస్తున్నారా ? ప్రమాదమే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసుకోండి..
Salad
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 22, 2021 | 8:12 PM

ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఎక్కువగా వేధిస్తున్న సమస్య ఉబకాయం. అధిక బరువుతో చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా యువత సంఖ్యే ఎక్కువగా ఉంది. మారుతున్న జీవనశైలి.. ఎక్కువ గంటలు కూర్చుని పనిచేయడం.. శారీరక శ్రమ తగ్గిపోవడం.. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలతోపాటు.. అధిక బరువు సమస్య కూడా తీవ్రంగా వేధిస్తోంది. దీంతో చాలా మంది బరువు తగ్గించుకోవడానికి వ్యాయమాలు, జిమ్, డైట్ పాటించడం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం చాలా వరకు హెల్తీ ఫుడ్ అని.. సులభంగా బరువు తగ్గొచ్చు అని సలాడ్ తినడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సలాడ్ నిజంగానే ఫలితం చూపిస్తుంది. సలాడ్ వలన బరువు తగ్గొ్చ్చు. ఇందులో తక్కువ కేలరీలు, ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే ఆకలి వేయదని.. ఫలితంగా బరువు తగ్గొచ్చు అని అనుకుంటారు. అయితే మితిమీరితే ఎదైనా ప్రమాదమే అంటున్నారు నిపుణులు. అలాగే సలాడ్ కూడా ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం అంటున్నారు. ఆయుర్వేద వైద్యులు సలాడ్ తరచూ తీసుకోవడం మంచిది కాదు అంటున్నారు. డాక్టర్ అల్కా విజయన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో సలాడ్ గురించి అనేక అపోహలపై క్లారిటీ ఇచ్చారు.

1. ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఫలితంగా కడుపు నిండుగా ఉండడమే కాకుండా.. జీవక్రియపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని అనుకుంటారు. కానీ అధిక ఫైబర్ అధికంగా పొడిబారడానికి కారణమవుతుంది. అలాగే ఇది ఎక్కువగా కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా.. కడుపులో అక్కడక్కడ నొప్పి కలుగుతుంది. గ్యాస్ సమస్య వస్తుంది. అలాగే కీళ్ల నొప్పులకు కూడా కారణమవుతుంది. 2. రాత్రి సమయంలో తేలిక పాటి ఆహారం తీసుకోవాలి. రాత్రిళ్లు సలాడ్ తీసుకుంటే… తొందరగా జీర్ణం కాదు. అందుకే రాత్రి తినేముందు సలాడ్ తీసుకోవద్దు. 3. రెగ్యులర్ గా ఫైబర్ తీసుకోవడం వలన వాతం సమస్య వస్తుంది. అలాగే ఎక్కువగా జుట్టు రాలిపోతుంది. 4. ఫైబర్ తీసుకోవడం వలన జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అలాగే పేగులో పొడిబారడం జరుగుతుంది. 5. సలాడ్ వారానికి కేవలం రెండుసార్లు మాత్రమే తినాలి. సలాడ్ తినేముందు భోజనం కూడా తీసుకోవాలి. గ్యాస్ సమస్య ఉన్నవారు సలాడ్ తీసుకోవద్దు.

Also Read: Ashu Reddy: ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి మరీ లవ్ ప్రపోజ్ చేసిన ఆషు రెడ్డి.. గిఫ్ట్ ఎంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..

Sai Pallavi: తన లవ్ స్టోరీ గురించి సాయి పల్లవి ముచ్చట్లు.. నా డ్రీం కోసమే ఇదంతా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు(ఫొటోస్)