అలాగే.. “లవ్ స్టోరి”లో చైతూ, నా క్యారెక్టర్స్ ద్వారా దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక మంచి విషయాన్ని చెప్పించారు. మనలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు, మాస్టర్స్ కాదు.. కానీ ప్రయత్నించి సాధించాలనే విల్ పవర్ ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. అలా మా రెండు క్యారెక్టర్స్ తమ డ్రీమ్స్ కోసం ప్రయత్నాలు చేస్తుంటాయి. నేను సాధించగలను అని బలంగా నమ్ముతాయి. మన చుట్టూ ఉన్న సమాజంలో, మన కుటుంబంలో కూడా వివక్షను చూస్తుంటాం. కానీ పోనీలే అని చాలా మంది అమ్మాయిలు, మహిళలు వదిలేస్తుంటారు.