Eye Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలు పోగొట్టడం ఎలా..? అద్భుతమైన చిట్కాలు..!

Eye Dark Circles: మనిషికి శరీరంలో కళ్లు కూడా ముఖ్యమైనవి. ఇవి బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాము. లేకపోతే అంధకారమే. కళ్ల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి..

Eye Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలు పోగొట్టడం ఎలా..? అద్భుతమైన చిట్కాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 24, 2021 | 8:48 PM

Eye Dark Circles: మనిషికి శరీరంలో కళ్లు కూడా ముఖ్యమైనవి. ఇవి బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాము. లేకపోతే అంధకారమే. కళ్ల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా కళ్ల కింద నల్లటి వలయాలు చాలా మందికి ఏర్పడుతుంటాయి. నల్లటి వయయాలను తగ్గించుకునేందుకు రకరకాల చిట్కాలు వాడుతుంటారు. ఏర్పడటానికి కారణాలు చాలా ఉంటాయి. నిద్రలేమి, పోషకాహార లోపం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, ఎండలో ఎక్కువగా తిరగడం, అలర్జీ.. ఇలా చాలా అంశాలు నల్లటి వలయాలకు కారణమవుతాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటిని సులభంగా దూరం చేసుకోవచ్చంటున్నారు కంటి వైద్య నిపుణులు.

నల్లటి వలయాలకు చిట్కాలు..

► కీర దోసను ముక్కలుగా కట్‌ చేసి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత వాటిని పావుగంట పాటు కళ్లపై పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు తగిన విశ్రాంతి లభిస్తుంది. నల్లటి వలయాలు నెమ్మదిగా దూరమవుతాయి.

► సాధారణంగా అలొవెరా అందరి ఇళ్లలో ఉంటుంది. ఇది చర్మానికి అవసరమైన మాయిశ్చర్‌ని అందిస్తుంది. దీని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని చాలా మంది వైద్య నిపుణులు చెబుతుంటారు. అలొవెరాను కొద్దిగా కట్‌ చేసి జెల్‌ను కళ్ల కింద భాగంలో రాయాలి. ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు పోయేందుకు అలొవెరా ఎంతగానో ఉపయోగపడుతుంది.

► బంగాళదుంపను గుజ్జుగా చేసి, ఆ గుజ్జును కళ్లపై పావుగంట పాటు ఉంచితే చాలు మంచి ఫలితం ఉంటుంది. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే కళ్ల కింది నల్లటి వలయాలు దూరమవుతాయి.

► టొమాటోను కట్‌ చేసి ముక్కలను కళ్లపై పెట్టుకోవాలి. పావుగంట పాటు అలా వదిలేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఒక టీస్పూన్‌ టొమాటో జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం కలిపి కళ్ల కింద అప్లై చేసినా ఫలితం కనిపిస్తుంది.

► గ్రీన్‌టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, కెఫిన్‌ డార్క్‌ సర్కిల్స్‌ను దూరం చేయడంలో ఎంతగానో సహాయపడతాయి. గ్రీన్‌ టీ తయారు చేసుకున్నాక ఆ టీ బ్యాగ్‌ని పడేయకుండా ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లటి టీ బ్యాగ్‌ని కళ్లపై పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

► కొద్దిగా దూది తీసుకుని రోజ్‌ వాటర్‌లో ముంచి కళ్లపై పెట్టుకోవాలి. పావుగంట పాటు ఇలా చేయడం వల్ల కళ్లు రీఫ్రెష్‌ అవుతాయి. దీంతో నల్లటి వలయాలు పోతాయి. ఇంట్లోనే ఉండి ఇలాంటి చిట్కాలు పాటిస్తే ఎంతో ఫలితం ఉంటుందంటున్నారు కంటి వైద్య నిపుణులు.

ఇవీ కూడా చదవండి:

Diabetic Eye Disease: మీ కళ్లు మసకబారుతున్నాయా..? ఈ వ్యాధి కావచ్చు చెక్‌ చేసుకోండి..!

Oil Purify Test: చిన్న ప్రయోగంతో మీ వంటింట్లో ఉండే నూనెలో కల్తీ ఉందో..? లేదో..తెలుసుకోండిలా..?

BP, Sugar: బీపీ, షుగర్‌ పెరిగిపోతోందా..? ఏం చేయాలి.. ప్రతి నలుగురిని ఈ రెండు జబ్బులు..!