Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid News: దేశంలో థర్డ్ వేవ్ వస్తుందా..? CSIR నిపుణులు ఏమని తేల్చారో తెలుసా..

Covid Third Wave: థర్డ్ వేవ్ ముప్పు ఉంటుందా? ఉండదా? ప్రస్తుత పండుగ సీజన్ కోవిడ్ థర్డ్ వేవ్‌కు దారితీస్తుందా? ఇప్పుడు దేశంలోని చాలా మంది మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు ఇవి.

Covid News: దేశంలో థర్డ్ వేవ్ వస్తుందా..? CSIR నిపుణులు ఏమని తేల్చారో తెలుసా..
Covid 19 Third Wave
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 24, 2021 | 10:06 PM

థర్డ్ వేవ్ ముప్పు ఉంటుందా? ఉండదా? ప్రస్తుత పండుగ సీజన్ కోవిడ్ థర్డ్ వేవ్‌కు దారితీస్తుందా? ఇప్పుడు దేశంలోని చాలా మంది మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు ఇవి. సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో థర్డ్ వేవ్ మొదలుకావచ్చని గతంలో కొందరు నిపుణులు అంచనావేశారు. తాజాగా థర్డ్ వేవ్ ముప్పు అవకాశాలపై కౌన్సిల్ ఆఫ్ సైన్టిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) నిపుణులు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. దేశంలో థర్డ్ వేవ్ వచ్చినా.. దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని తేల్చారు. తమ అంచనాల వెనుక బలమైన కారణాలను కూడా విశ్లేషించారు. ఇప్పటికే దేశంలో చాలా మంది ఒక డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నందున.. థర్డ్ వేవ్ ప్రభావం పెద్దగా ఉండదని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సీ మాండే పేర్కొన్నారు.

దేశంలో గణనీయ సంఖ్యలో జనాభా మొదటి డోస్, రెండో డోస్ వ్యాక్సిన్లు తీసుకోవడం శుభపరిణామం అన్నారు. వైరస్ వ్యాపించకుండా నియంత్రించడానికి వ్యాక్సిన్ దోహదపడుతుందన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ సోకినా.. దాని తీవ్రత పెద్దగా ఉండదన్నారు శేఖర్ సీ మాండే. థర్డ్ వేవ్ వచ్చినా.. దాని ప్రభావం సెకండ్ వేవ్ స్థాయిలో ఉండబోదన్నారు.

దేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు కొత్త స్ట్రెయిన్, వ్యాక్సినేషన్ మీదే ఆధారపడి ఉంటుందని నిపుణులు అంచనావేస్తున్నారు. కొత్త స్ట్రెయిన్ వ్యాపించే తీవ్రతను బట్టి థర్డ్ వేవ్ ఆధారపడి ఉంటుందని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫసర్ మణింద్ర అగర్వాల్ పేర్కొన్నారు. సెకండ్ వేవ్ తీవ్రత ఎప్పుడు గరిష్ఠ స్థాయికి చేరుతుందో అత్యంత కచ్చితంగా అంచనావేసిన ముగ్గురు సభ్యుల నిపుణులు బృందంలో ఆయన కూడా ఒకరు.

ప్రజల ప్రవర్తన, కొత్త వేరియంట్ ప్రవర్తనపైనే థర్డ్ వేవ్ ప్రభావం ఆధారపడి ఉంటుందని భారత ప్రభుత్వ సంస్థ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ ఇటీవల వ్యాఖ్యానించారు.

ఏప్రిల్-మే మాసాల్లో దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభించింది. ఒకానొక సందర్భంలో ప్రతి రోజూ నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. రోజూ 4 వేల మందికి పైగా మృతి చెందారు. యాక్టివ్ కేసులు 35 లక్షలకు ఎగువునకు చేరాయి. కోవిడ్ రోగులకు దేశ వ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ కొరత ఏర్పడింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటన మేరకు దేశంలో గత 24 గంటల వ్యవధిలో 31,382 కరోనా కేసులు నమోదయ్యాయి. 318 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో గత 188 రోజుల్లో కనిష్ఠ స్థాయిలో 3,00,162 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2020 మార్చి తర్వాత గరిష్ఠ స్థాయిలో రికవరీ రేటు 97.78శాతంగా ఉంది.