PM Modi in US: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ప్రధాని మోడీ మొదటి ద్వైపాక్షిక సమావేశం.. ఏం చర్చించారంటే..
అమెరికా ప్రెసిడెంట్ బైడెన్‌తో ప్రధాని మోడీ మీటింగ్. బైడెన్ ఆ దేశానికి అధ్యక్షుడు అయ్యాక జరగబోతున్న తొలి భేటీ ఇది. దాదాపు గంటపాటు ఇరువురి మధ్య పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి.

అమెరికా ప్రెసిడెంట్ బైడెన్‌తో ప్రధాని మోడీ మీటింగ్. బైడెన్ ఆ దేశానికి అధ్యక్షుడు అయ్యాక జరగబోతున్న తొలి భేటీ ఇది. దాదాపు గంటపాటు ఇరువురి మధ్య పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఉగ్రవాద నిర్మూలన, రక్షణరంగం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆఫ్ఘన్ పరిణామాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత బైడెన్ అధ్యక్షతన క్వాడ్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. సమకాలీన, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు. ఇక శనివారం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రసంగించనున్నారు ప్రధాని మోడీ.
ఇక ఇప్పటికే అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలాహ్యారిస్‌తో సమావేశమయ్యారు పీఎం. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా కమలా హ్యారిస్‌కు భారత పర్యటనకు రావాలని ఆహ్వానించారు ప్రధాని మోడీ.
ప్రధాని మోడీ 7 వ సారి అమెరికాలో పర్యటిస్తున్నారు
2014 లో అధికారం చేపట్టిన తర్వాత 7 వ సారి అమెరికా సందర్శించిన ప్రధాని, ఈ పర్యటన “యుఎస్‌తో మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు జపాన్ మరియు ఆస్ట్రేలియాతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక సందర్భం” అని అన్నారు. భారతదేశం నుండి బయలుదేరే ముందు, అతను అధ్యక్షుడు బిడెన్‌తో తన సమావేశంలో, భారతదేశం-యుఎస్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించి, పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకుంటారని సమాచారం.
ఇవి కూడా చదవండి: JC vs MLC Jeevan: రాజకీయాలు మాట్లాడాలంటే బయటే చూసుకోవాలి.. జేసీకి క్లాస్ పీకిన ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి..
CM Jagan: వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్..