Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్..

నిరుద్యోగులకు మరో గుడ్‌ న్యూస్‌ అందించింది ఏపీ ప్రభుత్వం. వైద్య ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌. డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా వెంటనే రిక్రూట్‌మెంట్‌ మొదలు పెట్టాలని స్పష్టం చేశారు.

CM Jagan: వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్..
Cm Jagan
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 24, 2021 | 6:28 PM

నిరుద్యోగులకు మరో గుడ్‌ న్యూస్‌ అందించింది ఏపీ ప్రభుత్వం. వైద్య ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌. డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా వెంటనే రిక్రూట్‌మెంట్‌ మొదలు పెట్టాలని స్పష్టం చేశారు. సుమారు 14 వేల 200 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు ముఖ్యమంత్రి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి, వైద్య కాలేజీ, బోధనా ఆస్పత్రుల వరకు ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించారు. సుమారు 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వైద్యకళాశాల, బోధనాసుపత్రుల వరకూ భర్తీ చేయాలన్నారు. అక్టోబరు నుంచి ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ఈ ప్రక్రియ నవంబర్‌ 15 నాటికి ముగించాలన్నారు. ఈ కార్యాచరణకు సీఎం జగన్‌ ఆమోదం ముద్ర వేశారు.

కోవిడ్ నియంత్రణ చర్యల పై సమీక్ష..

సిబ్బంది కొరతలేకుండా నియామకాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ వివిధ స్థాయిల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. జాతీయ స్థాయిలో ప్రమాణాలు, ప్రస్తుతం ఉన్న అవసరాలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం.

సీఎం జగన్ కామెంట్స్..

ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదని ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఆస్పత్రులను నిర్మిస్తున్నామన్నారు. తీరా అక్కడ చూస్తే.. సిబ్బంది లేక రోగులకు సేవలు అందని పరిస్థితి ఉందన్నారు. సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలే మనం నిత్యం చూస్తున్నామన్నారు. ఇకపై దీనికి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యం కోసం భారీగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి పోవాలన్నారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందాలన్నారు. ఈ దిశగా అడుగులు వేయాలని అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. కావాల్సిన సిబ్బందిని వెంటనే నియమించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తోపాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు సరిపడా సిబ్బందితో సమర్థవంతంగా నడపాన్నారు.

ఒక డాక్టరు సెలవులో వెళ్తే.. ఆ స్థానంలో మరో డాక్టరు విధులు నిర్వహించేలా … దీనికి తగిన సంఖ్యలో వైద్యులను నియమించాలన్నారు. డాక్టరు సెలవు పెడితే.. రోగులకు వైద్యం అందని పరిస్థితికాని.., తోటి డాక్టర్లపై భారం పడే పరిస్థితి కాని ఉండకూడదని స్పష్టం చేసిన సీఎం జగన్.

ఇవి కూడా చదవండి: JC vs MLC Jeevan: రాజకీయాలు మాట్లాడాలంటే బయటే చూసుకోవాలి.. జేసీకి క్లాస్ పీకిన ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి..