YSR Aarogyasri: ‘డెంగ్యూ’ ఆరోగ్యశ్రీ పరిధిలో ఉందా..? లేదా..? ఏపీ ఆస్పత్రుల్లో వింత పరిస్థితులు

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుంది ఏపీలో ఆరోగ్యశ్రీ పరిస్థితి. ప్రభుత్వం వరమిచ్చినా ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం కరుణించడం లేదు

YSR Aarogyasri: 'డెంగ్యూ' ఆరోగ్యశ్రీ పరిధిలో ఉందా..? లేదా..? ఏపీ ఆస్పత్రుల్లో వింత పరిస్థితులు
Ap Dengue Cases
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 24, 2021 | 6:29 PM

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుంది ఏపీలో ఆరోగ్యశ్రీ పరిస్థితి. ప్రభుత్వం వరమిచ్చినా ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం కరుణించడం లేదు. దాంతో, పేదలకు ఆరోగ్యశ్రీ అందని ద్రాక్షే అవుతోంది. ఆస్పత్రుల ముందేమో ఆరోగ్యశ్రీ బోర్డులు… లోపల అడిగితే మాత్రం తిక్కతిక్క సమాధానాలు… ఇదీ ప్రైవేట్ హాస్పిటల్స్ తీరు. ఆరోగ్యశ్రీలో డెంగ్యూ ఉన్నా… అడ్మిట్ చేసుకునేందుకు మాత్రం నిరాకరిస్తున్నాయి. అదేంటని అడిగితే… ఇప్పుడు తీసుకోవడం లేదు అంతే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2వేల 434 వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చింది. ఈ 2వేల 434 వ్యాధుల్లో డెంగ్యూ కూడా ఉంది. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్‌కి వెళ్తే మాత్రం మొండిచెయ్యే ఎదురవుతోంది.

బిల్లు వెయ్యి దాటితే ప్రభుత్వమే చెల్లిస్తుంది. కానీ, ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ అందించేందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ నిరాకరిస్తున్నాయి. టీవీ9 నిఘా టీమ్‌ ఆపరేషన్‌లో ఇది రుజువైంది. బెజవాడలోని సన్‌రైజ్, మెట్రో, హెల్ప్‌, కేపిటల్ హాస్పిటల్స్‌లో సిబ్బంది రకరకాలుగా సమాధానాలు ఇస్తున్నారు.  జర్వాలకు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ లేదనేవారు ఒకరైతే… ఆరోగ్యశ్రీ ఉంది కానీ ముందు రిపోర్ట్స్ తీసుకురండి అప్పుడు చూద్దామనేవారు మరొకరు. అసలు, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ చేసుకోవడం లేదని చెప్పేవారు ఇంకొందరు.

ఆంధ్రప్రదేశ్ అంతటా డెంగ్యూ విజృంభిస్తోంది. ప్రజలు పెద్దఎత్తున వైరల్ ఫీవర్స్ బారినపడుతున్నారు. డెంగ్యూ పేషెంట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్‌ అన్నీ నిండిపోతున్నాయి. దాంతో, బాధితులు ప్రైవేట్ హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తుంటే ఇదే అదునుగా దోపిడీకి పాల్పడుతున్నాయి. లక్షలు దండుకుంటున్నాయి. వైద్యారోగ్య శాఖ వెంటనే స్పందించి.. పేదవాడికి సరైన వైద్యం అందించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది.

Also Read:‘‘మణికే మాగే హితే’’, ‘రౌడీ బేబీ’.. ఈ 2 బ్లాక్‌బాస్టర్ సాంగ్స్ మాషప్.. నెక్ట్స్ లెవల్ అంతే

Tollywood Drugs Case: ఏంటీ మిస్టరీలు..? ఒకరేమో పత్తాలేకుండా పోయారు.. మరొకరు కోర్టుకు రారు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే