Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దు.. టీటీడీ వెబ్‌సైట్‌పై వివరణ ఇచ్చిన టీటీడీ..

సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఈవో ధర్మారెడ్డి స్పందించారు.  కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

TTD: సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దు.. టీటీడీ వెబ్‌సైట్‌పై వివరణ ఇచ్చిన టీటీడీ..
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 24, 2021 | 3:55 PM

సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఈవో ధర్మారెడ్డి స్పందించారు.  కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారంలో నిజం లేదన్నారు. కరోనాకు ముందు ప్రతి మూడు నెలలకు 18లక్షల టికెట్లు విడుదల చేసేవాళ్లమని చెప్పారు. ఆ సమయంలో కంట్రోల్-ఎస్ సంస్థతో తాము ఒప్పందం చేసుకున్నామన్నారు. ఆ సంస్థకు నెలకు రూ.60 లక్షలు చెల్లించి వారి సహకారంతో టికెట్లు విడుదల చేసేవాళ్లమని చెప్పారు. కరోనా వల్ల ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ప్రతినెలా టికెట్లు విడుదల చేస్తున్నామన్నారు. ఈ ఏడాది జనవరి నుండి APTSకు ఈ పనిని అప్పగించామన్నారు.

కోవిడ్ కొద్దిగా తగ్గుముఖం పట్డంతో భక్తుల రష్ పెరిగిందన్నారు. ఆగస్టు నెలలో దర్శనం టికెట్ల కోసం విపరీతమైన హిట్స్ రావడంతో సర్వర్లు క్రాష్ అయ్యాయని ఇలాంటి ఇబ్బందులు తలత్తెకుండా మరో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు క్లౌడ్ సర్వర్లు కలిగిన పెద్ద సంస్థలను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు.

అందులో భాగంగా దేశంలోని అతి పెద్ద సంస్థ జియో తిరుమల భక్తులకు ఉచితసేవలు అందించేందుకు ముందుకు వచ్చిందని అన్నారు. జియో సర్వీసులకు TTD ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదన్నారు. ఈరోజు టికెట్ల విడుదల సమయంలో కూడా సమస్యలు వచ్చినప్పటికీ.. ఒకటిన్నర గంటలో సమస్యను పరిష్కరించడం అభినందనీయమన్నారు.

శ్రీవారి భక్తులకు ఉచితంగా సేవలందించేందుకు ముందుకువచ్చిన జియోమార్ట్ పై అనవసరంగా నిందలు మోపుడం సరికాదన్నారు. ఈ రోజే టీటీడీ వెబ్ సైట్ కు కోటికి పైగా యూజర్ల నుంచి ఒత్తిడి వచ్చిందన్నారు. అయినప్పటికీ భక్తులు టికెట్లను విజయవంతంగా బుక్ చేసుకున్నారని వివరించారు. ఉచితంగా సేవలందిస్తున్న జియో టీమ్‌కు శ్రీవారు ఆయురారోగ్యాలు ప్రసాదించాలన్నారు టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి.

ఇవి కూడా చదవండి: కనిపించకుండా పోయిన భార్య, పిల్లల ఆచూకీ గుర్తించారు.. అయితే పోలీసుల దర్యాప్తులో దిమ్మదిరిగే ట్విస్ట్

Errabelli Dayakar Rao: రోడ్డు ప్రమాదంలో మంత్రి ఎర్రబెల్లికి తప్పిన ముప్పు.. కాన్వాయ్‌ను ఢీకొన్న బైక్‌!