Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ 4 వస్తువులు ఎప్పుడు అయిపోకూడదు..! ఎందుకంటే..?

Vastu Tips: ప్రతి వ్యక్తి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, కీర్తి, సంపదను కోరుకుంటాడు. అందుకోసం లక్ష్మీ దేవి అనుగ్రహం తప్పనిసరి. వాస్తు ప్రకారం లక్ష్మిదేవికి అసంతృప్తి కలిగిస్తే

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ 4 వస్తువులు ఎప్పుడు అయిపోకూడదు..! ఎందుకంటే..?
Kitchen
Follow us
uppula Raju

|

Updated on: Sep 24, 2021 | 3:22 PM

Vastu Tips: ప్రతి వ్యక్తి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, కీర్తి, సంపదను కోరుకుంటాడు. అందుకోసం లక్ష్మీ దేవి అనుగ్రహం తప్పనిసరి. వాస్తు ప్రకారం లక్ష్మిదేవికి అసంతృప్తి కలిగిస్తే ఆ ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. అందుకే ఇంట్లోని వంటగదిలో ఈ 4 వస్తువులు ఎల్లప్పుడు నిండుగా ఉండాలి. వాటి పరిమాణం ఎప్పుడూ తగ్గకూడదు. ఒకవేళ ఇవి అయిపోయాయంటే ఇంట్లో ప్రతికూల శక్తి పెరగడం ప్రారంభమవుతుంది. ఆ వస్తువులు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. పసుపు పసుపును శుభకార్యాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆహారానికి రంగును తీసుకురావడంతో పాటు శుభానికి చిహ్నంగా భావిస్తారు. జ్యోతిష్యుల ప్రకారం.. ఇంట్లో పసుపు అయిపోవడం అశుభంగా పరిగణిస్తారు. అందువల్ల పసుపు పూర్తిగా అయిపోక ముందే తగిన చర్యలు తీసుకోవాలి.

2. ఉప్పు వాస్తు శాస్త్రంలో ఉప్పు గురించి చాలా విషయాలు చెప్పారు. ఉప్పు అయిపోయినప్పుడు ఇంటి వంటగదిలోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. దీని కారణంగా ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. డబ్బు సమస్యలు ఏర్పడుతాయి. ఆహారంలో ఉప్పు లేకుంటే రుచిని ఏ విధంగానైతే కోల్పోతారో జీవితం కూడా అలాగే తయారవుతుందని చెప్పారు.

3. పిండి వంటగదిలో పిండి చాలా ముఖ్యమైనది. ఇది లేకుండా రొట్టె తయారు చేయలేము. కొన్నిసార్లు నెలాఖరులో పిండి అయిపోవచ్చు. కనుక ఎక్కువ పరిమాణంలో పిండి ఉండే విధంగా చూసుకోవాలి. వాస్తు ప్రకారం పిండి అయిపోవడం అశుభంగా పరిగణిస్తారు. ఇది గౌరవాన్ని కోల్పోయేలా చేస్తుంది.

4. బియ్యం పూజలో బియ్యం వాడతారు. ఇంట్లో బియ్యం అయిపోతే శుక్ర గ్రహం ప్రభావితమవుతుంది. దీని కారణంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతాయి. అందుకే ఎల్లప్పుడూ మీ వంటగదిలో బియ్యం నిండుగా ఉండేలా చూసుకోవాలి.

5. ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించండి. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.

వైరల్‌ ఫీవర్‌ బారిన పడకుండా ఉండాలంటే ఈ 3 పానీయాలు తప్పనిసరి..! అవేంటంటే..?

జట్టు తప్పుగా కత్తిరించిన సెలూన్‌కు రూ.2 కోట్ల ఫైన్.. నేషనల్ వినియోగదారుల కోర్టు కీలక తీర్పు

Festive Season: పండగ సీజన్‌లో సామాన్యులకు షాక్‌.. వీటి ధరలు భారీగా పెరగనున్నాయ్‌..!