Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Festive Season: పండగ సీజన్‌లో సామాన్యులకు షాక్‌.. వీటి ధరలు భారీగా పెరగనున్నాయ్‌..!

Festive Season: పండగ సీజన్‌ వచ్చిందంటే చాలు.. వివిధ ప్రొడక్ట్‌లు జోరుగా అమ్మకాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా స్మార్ట్‌టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, స్మార్ట్‌ఫోన్‌లు..

Festive Season: పండగ సీజన్‌లో సామాన్యులకు షాక్‌.. వీటి ధరలు భారీగా పెరగనున్నాయ్‌..!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 24, 2021 | 2:55 PM

Festive Season: పండగ సీజన్‌ వచ్చిందంటే చాలు.. వివిధ ప్రొడక్ట్‌లు జోరుగా అమ్మకాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా స్మార్ట్‌టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, స్మార్ట్‌ఫోన్‌లు తదితర ప్రొడక్ట్‌లు విపరీతంగా అమ్మకాలు జరుగుతుంటాయి. ఇక డిమాండ్‌కు తగినట్లు ఆయా కంపెనీలు ఉత్పత్తులపై ఆఫర్లు, డిస్కౌంట్లు భారీగానే ఆస్తుంటాయి. దీంతో కస్టమర్లు కూడా ఎగబడి కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది పండగ సీజన్‌ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ రకాల ఉత్పత్తుల ధరలను దాదాపు 8 శాతం పెంచేందుకు పలు సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు ఎకనమిక్‌ టైమ్స్‌ ఓ నివేదికలొ తెలిపింది.

ఈ ఏడాది పండగ సీజన్‌ సందర్భంగా కార్లు, బైక్‌, స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టీవీ, రిఫ్రిజిరేటర్‌, ఏసీ ప్రొడక్ట్‌ల ధరలను పెంచనున్నట్లు నివేదికలో తెలిపింది. వీటిలో కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై 8శాతం వరకు, టూవీలర్లరపై 1 నుంచి 2శాతం వరకు పెరగనున్నాయని తెలుస్తోంది. పలు బ్రాండ్లపై 3 శాతం నుంచి 8 శాతానికి పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరికొన్ని సంస్థలు ఉత్పత్తుల ధరల్ని పెంచనున్నాయి. ఈ సందర్భంగా ఐడిసి ఇండియా(ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ ఇండియా) రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ మాట్లాడుతూ.. కొన్ని కంపెనీలు వచ్చే నెల ప్రారంభంలో టీవీలు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్‌ల వంటి గృహోపకరణాల ధరలను 3 నుంచి 7 శాతం ధరలను పెంచేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

ఈ ఏడాదిలో ఇప్పటికే ఆటోమొబైల్‌ రంగానికి చెందిన టూవీలర్లు, కార్ల ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఆయా మోడల్‌ని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉన్న కార్ల ధర రూ.50 వేల నుంచి రూ.2.5లక్షల వరకు పెరిగింది. అదే సమయంలో ద్విచక్ర వాహనాల ధరలు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పెంచాయి. ఇక గత 12 నుంచి 18 నెలల కాలంలో ఆయా సీజన్లను బట్టి కారు, టూవీలర్లపై అందించే ఇన్‌స్టాల్‌మెంట్స్‌ 10 నుంచి 15 శాతం వరకు పెరిగాయి. అయితే పెరుగుతున్న ధరలను బట్టి కొనుగోలు దారులు మైండ్‌ సెట్‌ మారిపోయిందని, ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో అత్యధికంగా అమ్ముడైన పది కార్ల మోడళ్ల ధర ఐదు సందర్భాల్లో మారిందని కన్సల్టెన్సీ జాటో డైనమిక్స్ ఇండియా ప్రెసిడెంట్ రవి భాటియా పేర్కొన్నారు.

స్టీల్‌ ధరలు రెట్టింపు..

ధరలు పెరుగుదల నేపథ్యంలో వీటితో పాటు స్టీల్ ధర కూడా రెట్టింపు అయ్యింది. అల్యూమినియం, రాగి ధరలు 20 నుంచి 25 శాతం పెరిగాయి. సెమీకండక్టర్ కొరతతో చిప్ ధరలు 25 శాతం నుంచి 75 శాతానికి పెరిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎకనమిక్‌ టైమ్స్‌ తన నివేదికలో వెల్లడించింది. అన్నింటికీ మించి సరుకు రవాణా వ్యయాలు 2 నుంచి 3 రెట్లు పెరగడంతో దిగుమతులకు మరింత భారంగా మారింది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌ ధరలు పెరుగగా, రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇవీ కూడా చదవండి:

Bank Account: మీకు అవసరం లేని బ్యాంకు ఖాతాలు ఉన్నాయా..? ఇలా మూసివేయండి.. లేకపోతే ఇబ్బందే..!

SBI Pension Seva Portal: పెన్షనర్లకు ఎస్‌బీఐ శుభవార్త.. ఇక నుంచి ఆ సర్టిఫికెట్‌ను ఏ బ్రాంచ్‌లోనైనా సమర్పించవచ్చు

Maruti Suzuki WagonR: తక్కువ ధరకే కారు.. కేవలం లక్ష రూపాయలకే.. ఎక్కడో తెలుసా..?

వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
కాసులకు కక్కుర్తిపడితే ఊచలు తప్పవు..బెట్టింగ్ బంగార్రాజులకు షాక్
కాసులకు కక్కుర్తిపడితే ఊచలు తప్పవు..బెట్టింగ్ బంగార్రాజులకు షాక్
38 గంటలు కదలకుండా నిలబడ్డ యూట్యూబర్.. బుగ్గ గిల్లినా వీడియో
38 గంటలు కదలకుండా నిలబడ్డ యూట్యూబర్.. బుగ్గ గిల్లినా వీడియో
చేప కొరకడంతో చెయ్యినే కోల్పోయాడు.. వీడియో
చేప కొరకడంతో చెయ్యినే కోల్పోయాడు.. వీడియో
రైలు పట్టాలపై ట్రక్.. ఇంతలో దూసుకొచ్చిన రైలు వీడియో
రైలు పట్టాలపై ట్రక్.. ఇంతలో దూసుకొచ్చిన రైలు వీడియో
తిరుమలలో పనిచేస్తున్న ఇతర మతస్థులపై సీఎం ఏమన్నారంటే..?
తిరుమలలో పనిచేస్తున్న ఇతర మతస్థులపై సీఎం ఏమన్నారంటే..?
ఐదో రోజు వాడీవేడిగా సాగుతోన్న తెలంగాణ అసెంబ్లీ..
ఐదో రోజు వాడీవేడిగా సాగుతోన్న తెలంగాణ అసెంబ్లీ..
కేజీ కజ్జికాయలు రూ.50 వేలా.. నోరెళ్లబెట్టిన నెటిజన్లు వీడియో
కేజీ కజ్జికాయలు రూ.50 వేలా.. నోరెళ్లబెట్టిన నెటిజన్లు వీడియో
మహా సముద్రంలో అంతుచిక్కని అద్భుతం.. సైంటిస్టులే షాక్‌!వీడియో
మహా సముద్రంలో అంతుచిక్కని అద్భుతం.. సైంటిస్టులే షాక్‌!వీడియో