Bank Account: మీకు అవసరం లేని బ్యాంకు ఖాతాలు ఉన్నాయా..? ఇలా మూసివేయండి.. లేకపోతే ఇబ్బందే..!

Bank Account: ఉద్యోగీత్యానో, ఇతర కారణాల వల్లనో కొత్త బ్యాంకు ఖాతాలను ప్రారంభిస్తుంటాము. కొన్నేళ్ల తర్వాత వాటి సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. అలాగని అన్ని..

Bank Account: మీకు అవసరం లేని బ్యాంకు ఖాతాలు ఉన్నాయా..? ఇలా మూసివేయండి.. లేకపోతే ఇబ్బందే..!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 22, 2021 | 8:34 PM

Bank Account: ఉద్యోగీత్యానో, ఇతర కారణాల వల్లనో కొత్త బ్యాంకు ఖాతాలను ప్రారంభిస్తుంటాము. కొన్నేళ్ల తర్వాత వాటి సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. అలాగని అన్ని బ్యాంకు ఖాతాలు నిర్వహించలేము. ఎప్పటికప్పుడు ఖాతాలు చెక్‌ చేసుకోవడం మంచిది. కార్యకలాపాలు కొనసాగించడం కష్టంతో కూడిన వ్యవహారం. పైగా వాటిలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఉంచడం తప్పనిసరి. అలా చేయకపోతే పెనాల్టీలు పడతాయి. దీనివల్ల క్రెడిట్‌ స్కోర్‌పైనా ప్రభావం పడుతుంది. అందుకే కొత్త ఖాతా తీసుకున్నప్పుడు పాతది మూసేయడం మంచిది.

మీరు ఏ బ్యాంకు ఖాతా మూసివేయాలని అనుఎకున్నా ఏదైనా చెల్లింపుల సేవకు అంటే ఫండ్స్‌ ఇండియా, పేటీఎం, స్విగ్గి, ఉబర్‌ వంటి ఖాతాలకు అనుసంధానం చేసి ఉంటే వాటిని డీ-లింక్‌ చేయాలి. యూఐపీఐ పేమెంట్స్‌ ఉంటే వాటని డీ-లింక్‌ చేయాలి. యూపీఐ పేమెంట్స్ మీ ఫోన్‌తో అనుసంధానం చేసి ఉంటాయి. అందుకే మొద‌ట వాటిని డీ-లింక్ చేయాల‌న్న విష‌యం గుర్తుంచుకోండి. దానికి బ‌దులుగా మీరు కొన‌సాగించాల‌నుకున్న అకౌంట్‌ను అనుసంధానం చేస్తే చెల్లింపుల‌కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉంటుంది. కొన్ని ఫ్లాట్‌ఫామ్‌లు డీ-లింక్‌ ఫారంను కూడా అడుగుతాయి.

అన్ని బ్యాంకులు క్లోజ‌ర్ ఫారంను అందిస్తాయి. బ్యాంకు శాఖ లేదా వెబ్‌సైట్ ద్వారా దీనిని పొందవచ్చు. ఉమ్మడి అకౌంట్‌ అయితే అంద‌రూ దీనికి స‌మ్మతి తెలుపాల్సి ఉంటుంది. ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసేందుకు మ‌రొక ఫారంలో ఖాతా నంబ‌ర్‌ను జ‌త చేసి ఇవ్వాల్సి ఉంటుంది.

బ్యాంకు డాక్యుమెంట్లు..

బ్యాంకు జారీ చేసిన‌ చెక్కు బుక్కుల‌ను, డెబిట్‌, క్రెడిట్ కార్డులు, పాస్‌బుక్‌, ఇత‌ర డాక్యుమెంట్లను తిరిగి ఇచ్చేయాలని కోరవచ్చు. ఖాతా క్లోజ‌ర్ ఫారంతో పాటు ఇవ‌న్నీ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఈ డాక్యుమెంట్లను చింపేయాల్సిందిగా సూచిస్తారు.

బ్యాంకు ఛార్జీలు..

అకౌంట్‌ ప్రారంభించిన ఏడాదిలోగా మూసేస్తే బ్యాంకులు ముగింపు ఛార్జీల‌ను వ‌సూలు చేస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఎస్‌బీఐ ఖాతా ప్రారంభించిన 14 రోజుల్లో మూసివేస్తే ఛార్జీలు లేవు. 15వ రోజు నుంచి ఏడాదిలోపు మూసివేస్తే రూ.500 ఛార్జీల‌తో పాటు జీఎస్‌టీ వ‌ర్తిస్తుంది. సంవత్సరం దాటితే మ‌ళ్లీ ఎలాంటి రుసుములూ ఉండ‌వు. ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్రకారం బ్యాంకులు స్వతంత్రంగా ఈ ముగింపు ఛార్జీల‌ను విధించుకోవ‌చ్చు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన త‌ర్వాత బ్యాంకుకు చెల్లించాల్సిన‌ ఏవైనా పెండింగ్ ఛార్జీలు ఉంటే తనిఖీ చేస్తాయి. అకౌంట్‌ ఖాతా ముగించిన‌ట్లు బ్యాంకు వ‌ద్ద అక్‌నాలెడ్జ్‌మెంట్ తీసుకోవడం తప్పనిసరి. ఇవ‌న్నీ స‌రైన విధానంలో చేసి అవ‌స‌రం లేని ఖాతాల‌ను మూసివేస్తేనే ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉంటుంది.

ఇవీ కూడా చదవండి:

SBI Pension Seva Portal: పెన్షనర్లకు ఎస్‌బీఐ శుభవార్త.. ఇక నుంచి ఆ సర్టిఫికెట్‌ను ఏ బ్రాంచ్‌లోనైనా సమర్పించవచ్చు

Train Ticket: రైలు టికెట్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రూ.10 లక్షల వరకు బెనిఫిట్స్‌.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

43 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన షేర్లు.. ఇప్పుడు దాని విలువ రూ.1448 కోట్లు.. క్లెయిమ్‌ కోసం పోరాటం..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే