43 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన షేర్లు.. ఇప్పుడు దాని విలువ రూ.1448 కోట్లు.. క్లెయిమ్‌ కోసం పోరాటం..!

స్టాక్ మార్కెట్లో ఏదైనా సాధ్యమే. కుబేరుడు సైతం రాత్రికి రాత్రి నేల మీదికి వచ్చేయవచ్చు. మంచి స్టాక్‌ను సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేస్తే.. దాని ఫలితం ఎలా ఉంటుందో ఇది..

43 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన షేర్లు.. ఇప్పుడు దాని విలువ రూ.1448 కోట్లు.. క్లెయిమ్‌ కోసం పోరాటం..!

స్టాక్ మార్కెట్లో ఏదైనా సాధ్యమే. కుబేరుడు సైతం రాత్రికి రాత్రి నేల మీదికి వచ్చేయవచ్చు. మంచి స్టాక్‌ను సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేస్తే.. దాని ఫలితం ఎలా ఉంటుందో ఇది చూస్తే అర్థమైపోతుంది. అదే సమయంలో ఓ చిన్న ట్విస్ట్ కూడా ఉంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కోచ్చికి చెందిన బాబు జార్జ్ వాలవీకి చిత్రమైన స్థితి. తాను 1978లో ఓ కంపెనీకి చెందిన షేర్లు కొనుగోలు చేసి మర్చేపోయాడు. వయస్సు మీదపడడంతో దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ అనుకోకుండా బయటపడిన షేర్ సర్టిఫికెట్లను చూసి.. లెక్కించుకుంటే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆ షేర్ల విలువ అక్షరాలా రూ.1448 కోట్లు. కానీ ఒక్క చిన్న తప్పుతో ఇప్పుడు ఇబ్బందుల్లో పడిపోయాడు. పోరాటం కొనసాగిస్తున్నాడు.

1978లో బాబు జార్జ్ వాలవి, అతని నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి ఉదయ్‌పూర్‌కు చెందిన మెవార్ ఆయిల్ అండ్ జనరల్ మిల్స్ అనే ఒక అన్ లిస్టెడ్ కంపెనీలో 3500 షేర్లు కొనుగోలు చేశాడు. అప్పట్లో వాలవీ ఈ సంస్థకు డిస్ట్రిబ్యూటర్‌గా ఉండేవారు. ఆ సమయంలో ఈ కంపెనీలో 3500 షేర్లు కొన్నాడు. అప్పట్లో సంస్థ చైర్మన్ పిపి సింఘాల్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా కొనుగోలు చేసిన షేర్ల విలువ సంస్థలో 2.8 శాతం వాటాగా మారింది. అయితే ఇది అన్ లిస్టెడ్ సంస్థ కావడం, డివిడెండ్లు కూడా సంస్థ ఏమీ ఇవ్వకపోవడంతో కమ్యూనికేషన్ పెద్దగా లేదు. దీంతో ఈ పెట్టుబడి గురించి వాలవి ఫ్యామిలీ కూడా పెద్దగా పట్టించుకోకపోవంతో మర్చిపోయింది.

2015లో బయటపడిన సర్టిఫికెట్లు..

బాబు జార్జ్ వాలవి 2015లో ఏదో పాత డాక్యుమెంట్ల కోసం వెతుకుతున్నప్పుడు ఈ ఫిజికల్ షేర్ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. దీంతో వాటి గురించి తెలుసుకుందామని ఆరా తీయగా, తెలిసిన సమాచారంతో అతను, అతని కుటుంబాన్ని మతిపోయేలా చేసింది. ఎందుకంటే మెవార్ ఆయిల్ కంపెనీ ఆ తర్వాత పేరు మారి పిఐ ఇండస్ట్రీస్ అయింది. దాని పనితీరు ఇప్పుడు ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

ఫిజికల్‌ షేర్లను డీమ్యాట్‌లోకి మార్చుకుందామని ప్రయత్నిస్తే..

అయితే ఫిజికల్ షేర్లను డీమ్యాట్‌లోకి మార్చుకుందామని ఆయన ప్రయత్నిస్తే.. అది కుదర్లేదు. నేరుగా రిజిస్ట్రార్ లేదా కంపెనీని సంప్రదించాలని బ్రోకర్లు సూచించారు. అయితే తీరా కంపెనీకి వెళ్తే.. సదరు షేర్లు లేవని, వాటిని 1989లోనే ఇతరులకు అమ్మేసినట్టు సమాచారం ఉందని తేల్చేసింది. దీంతో ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేసేందుకు అప్పట్లో వాలవి కుటుంబం సిద్ధమైంది. ఇక చేసేది లేక కంపెనీ ఇద్దరు సీనియర్ ఉద్యోగులను కోచ్చి పంపి డాక్యుమెంట్ల నిజనిర్ధారణ చేసుకుంది. ఆ తర్వాత దీనిపై కంపెనీ సెటిల్మెంట్ చేసుకునేందుకు యత్నించడంతో వాలవి నిరాకరించారు.

వాలవి మాటల ప్రకారం అప్పట్లో 13 మందికి తన దగ్గరున్న షేర్లను అక్రమంగా దొంగ సర్టిఫికెట్లను సృష్టించి విక్రయించారని, ఇందులో అప్పటి కంపెనీ సెక్రటరీ పాత్ర ఉందని ఆరోపించారు. వాళ్లంతా ఓ క్రమపద్ధతిలో తన షేర్లను తనకు కాకుండా చేశారని విమర్శిస్తున్నారు. ఇప్పుడు లెక్కించి చూస్తే.. వాలవి మాటల ప్రకారం దగ్గర 42.8 లక్షల పిఐ ఇండస్ట్రీస్ షేర్లు ఉండాలి. ఇప్పుడు దాని విలువ రూ.1448 కోట్లు ఉంది.

సెబీ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు..

కాగా, ఈ వ్యవహారంపై వాలవి సెబీ దృష్టి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు వాలవి. 74 ఏళ్ల వయస్సులో తనను తిప్పలు పెడుతున్నారు. కంపెనీ కావాలనే ఆలస్యం చేస్తోందని, సెబీ దర్యాప్తుతో అసలు నిజం బయట పడుతుందని చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Gram Suraksha Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.1500 పెట్టుబడితో చేతికి రూ.35 లక్షలు.. పూర్తి వివరాలు..!

Bank New Rules: మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? ఈ విషయాలు తెలుసుకోండి.. అక్టోబర్‌ 1 నుంచి మారనున్న నిబంధనలు

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu