AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple iphone 13: ఐఫోన్‌-13 ప్రీ-బుకింగ్స్‌లో దుమ్మురేపిన భారతీయులు..!

Apple iphone 13: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఐఫోన్‌ 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో విడుదలైన విషయం తెలిసిందే. ఈనెల 14 విడులైన ఈ ఫోన్‌.. భారత్‌లో ఐఫోన్‌..

Apple iphone 13: ఐఫోన్‌-13 ప్రీ-బుకింగ్స్‌లో దుమ్మురేపిన భారతీయులు..!
Subhash Goud
|

Updated on: Sep 21, 2021 | 9:26 PM

Share

Apple iphone 13: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఐఫోన్‌ 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో విడుదలైన విషయం తెలిసిందే. ఈనెల 14 విడులైన ఈ ఫోన్‌.. భారత్‌లో ఐఫోన్‌ సెప్టెంబర్‌ 17 నుంచి ప్రీ-బుకింగ్‌ ఆర్డర్స్‌ జరుగుతాయని ఆపిల్‌ ప్రకటించింది. తాజాగా జరిగిన ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ప్రీ-బుకింగ్స్‌లో భారతీయులు దుమ్మురేపారు. రిటైల్ ట్రేడ్ వర్గాల ప్రకారం.. గత సంవత్సరం లాగానే రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా ఐఫోన్‌-13 స్మార్ట్‌ఫోన్లపై అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ట్రేండ్‌ ప్రకారం గత త్రైమాసికంలో ఐఫోన్‌-12 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల తరహాలో ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

వ్యాపార నిపుణుల అంచనా ప్రకారం..

ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలతో ఈ త్రైమాసికంలో యాపిల్‌ గణనీయమైన వృద్దిని సాధిస్తుందని వ్యాపార నిపుణులు అంచనా వేశారు. పండగ సీజన్‌తో భారత్‌లో ఆపిల్‌ భారీ వృద్దిని నమోదు చేస్తోందని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ డైరక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ తెలిపారు. అందుకు ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల ప్రీ-బుకింగ్స్‌ ఆర్డర్సే స్పష్టం చేస్తుందని చెప్పారు. ఐడిసి ఇండియా, దక్షిణాసియా రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ మాట్లాడుతూ, రాబోయే పండుగ సీజన్‌లో ఐఫోన్‌-12 సిరీస్‌, పాక్షికంగా ఐఫోన్‌-13, 13 ప్రో స్మార్ట్‌ఫోన్స్‌ ద్వారా యాపిల్ మంచి ఊపందుకుంటుందని అన్నారు.

సెప్టెంబర్‌ 24 నుంచి నాలుగు కొత్త ఐఫోన్ -13

సెప్టెంబర్ 24 నుంచి ఈ నాలుగు కొత్త ఐఫోన్‌ -13 స్మార్ట్‌ఫోన్స్‌ వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఐఫోన్ 13 సిరీస్ రూ. 69,900 నుంచి ప్రారంభించి ప్రో మాక్స్ రూ .1,29,900 వరకు అందుబాటులో ఉన్నాయి.

ఇవీ కూడా చదవండి:

43 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన షేర్లు.. ఇప్పుడు దాని విలువ రూ.1448 కోట్లు.. క్లెయిమ్‌ కోసం పోరాటం..!

Gram Suraksha Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.1500 పెట్టుబడితో చేతికి రూ.35 లక్షలు.. పూర్తి వివరాలు..!

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్