Train Ticket: రైలు టికెట్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రూ.10 లక్షల వరకు బెనిఫిట్స్‌.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

Train Ticket: రైలు ప్రయాణం చేయాలంటే తప్పకుండా టికెట్‌ తీసుకోవాల్సిందే. రైలు ప్రయాణం చేసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే చాలా మంది..

Train Ticket: రైలు టికెట్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రూ.10 లక్షల వరకు బెనిఫిట్స్‌.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 22, 2021 | 2:26 PM

Train Ticket: రైలు ప్రయాణం చేయాలంటే తప్పకుండా టికెట్‌ తీసుకోవాల్సిందే. రైలు ప్రయాణం చేసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే చాలా మంది రైలు టికెట్‌ ప్రయాణం కోసమేనని అనుకుంటారు. అందుకు కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రైలు టికెట్ వల్ల పలు రకాల బెనిఫిట్స్ పొందవచ్చు. క్లాక్ రూమ్, వెయిటింగ్ రూమ్, రూ.10 లక్షల ప్రమాద పరిహారం వంటి పలు ప్రయోజనాలు పొందవచ్చు. రైల్వే ప్రయాణికులు ఇన్సూరెన్స్ కవరేజ్ పొందాలంటే ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సమయంలో 49 పైసలు చెల్లించాలి.

ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రమాదం జరిగినప్పుడు ఆస్పత్రి చికిత్స కోసం రూ.2 లక్షల వరకు లభిస్తాయి. మరణిస్తే రూ.10 లక్షల చెల్లిస్తారు. అంగవైకల్యం సంభవిస్తే రూ.7.5 లక్షలు వస్తాయి. అంతేకాకుండా ట్రైన్‌లో జర్నీ చేసేటప్పుడు అనారోగ్యం సంభవిస్తే.. టీటీఈ నుంచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకునే సదుపాయం ఉంటుంది.

క్లాక్ రూమ్ సౌకర్యం, రెస్ట్ రూమ్, లాకర్ ఫెసిలిటీ వంటి సదుపాయాలు కూడా పొందవచ్చు. ప్రతి ఒక్క రైల్వే ప్రయాణికుడికి ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ట్రైన్ టికెట్ ద్వారా ఈ బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే కొన్నింటికి చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి ప్రయోజనాలున్న వాటిని తెలుసుకోవడం ఎంతో మంచిది. రైలు టికెట్‌ ప్రయాణించేందుకు మాత్రమే పనికొస్తుందనుకుంటారు తప్ప ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. అవసరం అనుకుంటే రైల్వే స్టేషన్‌లలో అడిగినా చెబుతారు. ఇలాంటి విషయాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవడం మంచిది.

ఇవీ కూడా చదవండి:

43 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన షేర్లు.. ఇప్పుడు దాని విలువ రూ.1448 కోట్లు.. క్లెయిమ్‌ కోసం పోరాటం..!

Gram Suraksha Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.1500 పెట్టుబడితో చేతికి రూ.35 లక్షలు.. పూర్తి వివరాలు..!