AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఈ 5 అత్యవసర సమయాల్లో PF డబ్బు విత్‌ డ్రా చేయొచ్చు..! ఆ పరిస్థితులు ఏంటంటే..?

EPFO: EPF ను ఎంప్లాయర్ పెన్షన్ స్కీమ్ (EPS) అని కూడా పిలుస్తారు. దీనిని ప్రభుత్వ పెన్షన్ ఫండ్ సంస్థ EPFO నిర్వహిస్తుంది. వ్యవస్థీకృత రంగాలలో ఉద్యోగం చేసేవారికి

EPFO: ఈ 5 అత్యవసర సమయాల్లో PF డబ్బు విత్‌ డ్రా చేయొచ్చు..! ఆ పరిస్థితులు ఏంటంటే..?
Pf Money
uppula Raju
|

Updated on: Sep 24, 2021 | 3:51 PM

Share

EPFO: EPF ను ఎంప్లాయర్ పెన్షన్ స్కీమ్ (EPS) అని కూడా పిలుస్తారు. దీనిని ప్రభుత్వ పెన్షన్ ఫండ్ సంస్థ EPFO నిర్వహిస్తుంది. వ్యవస్థీకృత రంగాలలో ఉద్యోగం చేసేవారికి ఈ ఫండ్ నుంచి పెన్షన్ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం జీతంలో కొంత భాగం పెన్షన్ ఫండ్‌కు కలుపుతారు. పనిచేసే కంపెనీ, ఉద్యోగి ఇద్దరూ ఇపిఎఫ్‌కు సహకరించాలి. తద్వారా ఉద్యోగి విరమణ చేస్తే పెన్షన్‌గా కొంత మొత్తాన్ని పొందుతాడు. ఈ పని యూనివర్సల్ అకౌంట్ నంబర్ లేదా యుఎన్ ద్వారా జరుగుతుంది. అయితే ఉద్యోగి విరమణ సమయంలో కాకుండా జీవితంలో ఈ 5 అత్యవసర పరిస్థితులలో కూడా పీఎఫ్ డబ్బును విత్‌ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందా.

గృహ రుణాన్ని తిరిగి చెల్లించడానికి 1. దీని కోసం మీ ఉద్యోగం ఇంకా10 సంవత్సరాలు ఉండాలి. 2. దీని కింద ఏ వ్యక్తి అయినా తన ప్రాథమిక జీతం కంటే గరిష్టంగా 36 రెట్లు PF డబ్బును విత్‌ డ్రా చేసుకోవచ్చు. 3. మీరు ఒక్కసారి మాత్రమే ఇలా డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు.

వ్యాధి చికిత్స కోసం 1. PF ఖాతాదారుడు తనకు లేదా తన కుటుంబ సభ్యుల చికిత్స కోసం PF మొత్తాన్ని విత్‌ డ్రా చేసుకోవచ్చు. 2. ఇటువంటి అత్యవసర పరిస్థితిలో PF డబ్బును ఎప్పుడైనా విత్‌ డ్రా చేసుకోవచ్చు. 3. ఇందుకోసం మీరు ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆసుపత్రిలో చేరినట్లు రుజువు చూపించాలి. 4. డబ్బు విత్‌డ్రా చేయడానికి ఫారం 31 కింద దరఖాస్తు చేయాలి.

వివాహం కోసం 1.ఖాతాదారుడు తన తోబుట్టువు లేదా పిల్లల వివాహానికి PF మొత్తాన్ని విత్‌ డ్రా చేసుకోవచ్చు. 2. ఇది కాకుండా పిల్లల విద్య కోసం PF మొత్తాన్ని విత్‌ డ్రా చేసుకోవచ్చు. దీని కోసం కనీసం 7 సంవత్సరాల పని చేసి ఉండాలి.

ప్లాట్లు కొనడానికి 1. ప్లాట్ కొనడానికి PF డబ్బు విత్‌ డ్రా చేయాలంటే ఇంకా మీ ఉద్యోగం కనీసం 5 సంవత్సరాలు ఉండాలి. ప్లాట్‌ని మీ భార్య పేరు లేదా ఇద్దరి పేరు మీద నమోదు చేయాలి. 2. ప్లాట్లు లేదా ఆస్తి ఎలాంటి వివాదంలో ఉండకూడదు. దానిపై చట్టపరమైన చర్యలు జరగకూడదు. 3. ఏ వ్యక్తి అయినా తన జీతంలో గరిష్టంగా 24 రెట్లు PF డబ్బును ప్లాట్‌ని కొనుగోలు చేయడానికి విత్‌ డ్రా చేసుకోవచ్చు. 4. మీ ఉద్యోగం మొత్తం సమయంలో ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

ఇంటి పునరుద్ధరణ 1. ఇంటి పునరుద్దరణ కోసం మీరు పీఎఫ్ డబ్బులు విత్‌ డ్రా చేయాలంటే కనీసం 5 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఉండాలి. 2. దీని కింద ఏ వ్యక్తి అయినా తన జీతం కంటే గరిష్టంగా 12 రెట్లు PF డబ్బును విత్‌ డ్రా చేసుకోవచ్చు. 3. మీ ఉద్యోగం మొత్తం సమయంలో ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

Corona Vaccination: ఇకపై ఇంటివద్దే కరోనా టీకాలు.. వ్యాక్సినేషన్ కొత్త మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రం

Rohit Sharma: దేవుడితో ఏం మాట్లాడతామంటూ అభిమాని భావోద్వేగం.. ఫిదా అయిన రోహిత్ శర్మ.. బహుమతిగా ఏమిచ్చాడంటే?

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ 4 వస్తువులు ఎప్పుడు అయిపోకూడదు..! ఎందుకంటే..?