Dairy Farming: పాడి రైతులకు గమనిక..! ఈ 5 పద్దతులు పాటిస్తే ఆదాయం రెట్టింపు..

Dairy Farming: భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. చాలామంది గ్రామాల్లో సాగునే నమ్ముకొని జీవిస్తున్నారు. వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ కూడా ఉంటుంది.

Dairy Farming: పాడి రైతులకు గమనిక..! ఈ 5 పద్దతులు పాటిస్తే ఆదాయం రెట్టింపు..
Milk
Follow us
uppula Raju

|

Updated on: Sep 24, 2021 | 12:57 PM

Dairy Farming: భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. చాలామంది గ్రామాల్లో సాగునే నమ్ముకొని జీవిస్తున్నారు. వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ కూడా ఉంటుంది. పశువులపై ఆధారపడి చాలామంది పాల వ్యాపారం చేస్తున్నారు. అయితే ఇందులో కొంతమంది మంచి ఆదాయం సంపాదిస్తే మరికొంత మంది నష్టాల పాలవుతున్నారు. దీనికి కారణం సరైన నిర్వహణ, పాడిపరిశ్రమపై అవగాహనలేకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఇది జరుగుతుంది. అయితే పాల వ్యాపారులు మంచి ధరలను పొందాలంటే కొన్ని పద్దతులు పాటించాలి. వాటి గురించి తెలుసుకుందాం.

1. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాలు పితికే ప్రదేశం, పాత్రలు శుభ్రంగా ఉండాలి. పాలు తీసే వ్యక్తి కూడా శుభ్రంగా ఉండాలి అనారోగ్యంతో ఉండకూడదు. పొదుగు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. లేదంటే పాలు దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఈ పాలు ఎవ్వరికీ నచ్చవు. అంతేకాదు ఈ పాలు ఎక్కువ కాలం ఉండవు. త్వరగా చెడిపోతాయి.

2. పాలు ఎక్కువ కాలం ఉండాలంటే శుభ్రమైన పొదుగు నుంచి వచ్చిన పాలు మాత్రమే ఎక్కువ కాలం ఉంటాయి. పాల ఉత్పత్తిలో పరిశుభ్రత ముఖ్య పాత్ర పోషిస్తుంది. పశువుల యజమానులు జంతువులకు పాలు పట్టడానికి 2-3 గంటల ముందు పచ్చిగడ్డి, మేత, ధాన్యాం పెట్టాలి. ప్రశాంతమైన వాతావరణంలో పాలు పితకాలి. అప్పుడే పాలు ఎక్కువ కాలం శుభ్రంగా ఉంటాయి.

3. చేతివేళ్లకు ఎలాంటి గాయాలు ఉండకూడదు.. పాలు పితికే సమయంలో పొదుగును మంచి నీటితో శుభ్రం చేయాలి. పాలు పితికే వ్యక్తి శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలి. అతని చేతులు, వేళ్లపై ఎలాంటి గాయం ఉండకూడదు. పాలు తీసేటప్పుడు ఈగలు, దోమలు పడకుండా జాగ్రత్త పడాలి. సరైన సమయంలో పాలను వేడి చేసి అవి చల్లబడిన తర్వాత మూతపెట్టాలి.

4. వ్యాధుల ప్రమాదం పాలు స్వచ్ఛంగా లేకపోతే చాలా వ్యాధులు సంక్రమిస్తాయి. క్షయ, మాల్టా జ్వరం, బ్రూసెల్లోసిస్, అతిసారం, విరేచనాలు, లిస్టెరోసిస్, లెప్టోస్పిరోసిస్, స్ట్రెప్టోకోకస్, స్టెఫిలోకాకస్, సాల్మొనెలోసిస్, కామెర్లు, హెపటైటిస్, టాక్సోప్లాస్మోసిస్, డిఫ్తీరియా, స్కార్లెట్, పోలియో, మైకోటాక్సికోసిస్ మొదలైనవి వచ్చే అవకాశం ఉంది.

5. శ్రమతో కూడుకున్న వ్యాపారం ఈ పద్దతులు పాటించి మీరు పాల వ్యాపారం చేస్తే అధిక లాభాలు సాధించవచ్చు. అంతేకాదు మంచి గుర్తింపు కూడా వస్తుంది. అయితే పాడి పరిశ్రమ అనేది కొంత శ్రమతో కూడుకున్న వ్యాపారం. దీనికి కొంత ఓపిక అవసరం. పశువులను జాగ్రత్తగా కాపాడితేనే ఈ పరిశ్రమలో అభివృద్ధి ఉంటుంది.

Banana Flower: అరటి పువ్వులో దాగున్న అద్భుత గుణాలు..! క్యాన్సర్, గుండె జబ్బులకు దివ్య ఔషధం..

Visakha Dog Park: గ్రామ సింహాల కోసం నగరంలో థీమ్ పార్క్.. కొత్త వివాదంలో ఏపీ కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం..

Sreeleela: టాలీవుడ్ క్రేజీ ఆఫర్లు అందుకుంటున్న పెళ్ళిసందడి బ్యూటీ.. స్టార్ హీరో సరసన శ్రీలీల…