Sreeleela: టాలీవుడ్ క్రేజీ ఆఫర్లు అందుకుంటున్న పెళ్ళిసందడి బ్యూటీ.. స్టార్ హీరో సరసన శ్రీలీల…

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు 25 ఏళ్ళక్రితం తెరకెక్కించిన పెళ్లి సందడి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Sreeleela: టాలీవుడ్ క్రేజీ ఆఫర్లు అందుకుంటున్న పెళ్ళిసందడి బ్యూటీ.. స్టార్ హీరో సరసన శ్రీలీల...
Shreeleela
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 24, 2021 | 12:04 PM

Sreeleela: దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు 25 ఏళ్ళక్రితం తెరకెక్కించిన పెళ్లి సందడి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో సెంటిమెంట్ , కామెడీ, ప్రేమ ఇలా ఎన్నో ఎమోషన్స్‌తో పెళ్లి సందడి సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా మంచి  విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే టైటిల్‌తో రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండగా కన్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతో శ్రీలీల తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది.

ఇక ట్రైలర్ చుసిన తర్వాత హీరోయిన్ శ్రీతీల క్రేజ్ పెరిగిపోతుంది. ఈ అమ్మడికోసం ఇప్పటికే కుర్రాళ్లంతా గూగుల్‌ని గాలిచేస్తున్నారు. ఇక యంగ్ హీరోలంతా ఈ అమ్మడిని తమ సినిమాల్లో ఫిక్స్ చేయాలని సంప్రదింపులు కూడా మొదలు పెట్టేశారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాస్ రాజా రవితేజ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తుంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు రవితేజ. ఆ సినిమా కోసమే శ్రీలీలను తీసుకున్నారని అంటున్నారు.ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమా తరవాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. అయితే రవి తేజ పక్కన ఈ అమ్మడు మరీ చిన్నపిల్లలా ఉంటుందన్న టాక్ కూడా వినిపిస్తుంది. చూడలి మరి ఏంజరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: నోరే కాదు మనసు కూడా పెద్దదే.. బిగ్ బాస్ రెమ్యునరేష్‌ని క్యాన్సర్ పేషేంట్‌కు ప్రాణం పోసేందుకు ఉమాదేవి డొనేషన్

Kangana Ranaut : మాస్టర్ ప్లాన్ వేస్తున్న మేకర్స్.. కంగనా తలైవికి సీక్వెల్ రానుందా.. ?

Rashmi Rocket Trailer: లేడీ అథ్లెట్‌గా అదరగొట్టిన తాప్సీ.. ఆకట్టుకుంటున్న ‘రష్మీ రాకెట్’ ట్రైలర్…