AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi-Nagarjuna: కోలీవుడ్‌లో కాసుల వర్షం కురిపించిన మూవీలో చిరు-నాగ్‌లు.. ఇదే నిజమైతే దక్షిణాదిలో మెగా మల్టీస్టార్‌గా చరిత్ర

Chiru-Nag Multi Starrer Movie: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతుంది. చిన్న యంగ్ హీరోలేదు.. స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలను..

Chiranjeevi-Nagarjuna: కోలీవుడ్‌లో కాసుల వర్షం కురిపించిన మూవీలో చిరు-నాగ్‌లు.. ఇదే నిజమైతే దక్షిణాదిలో మెగా మల్టీస్టార్‌గా చరిత్ర
Chiranjeevi And Nagarjuna
Surya Kala
|

Updated on: Sep 24, 2021 | 12:29 PM

Share

Chiru-Nag Multi Starrer Movie: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతుంది. చిన్న యంగ్ హీరోలేదు.. స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలను చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. తాజాగా దక్షిణాదిలో మరో మెగా మల్టీస్టారర్ సినిమాకు రంగం సిద్ధమవుతుందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ రీమేక్ లో టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలు నటించనున్నారంటూ టాలీవుడ్ సినీ వర్గాల టాక్.  మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిసి వెండి తెరపంచుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం.  కోలీవుడ్‌లో సూపర్ మూవీ ‘విక్రమ్ వేద’ సినిమాలో తెలుగు లో రీమేక్ చేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. విక్రమార్కుడు, బేతాళుడు కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కించిన ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. బాలీవుడ్‌లో ఈ రీమేక్‌ను హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్‌లతో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో ఇప్పటికే బాలయ్య-రాజశేఖర్, నాగార్జున -వెంకటేష్‌, పవన్ కళ్యాణ్- రవితేజ ఇలా చాలామంది హీరోల కాంబినేషన్ పేర్లు తెరపైకి రాగా.. ఫైనల్‌గా ఇపుడు చిరు నాగ్ లు పేర్లు వినిపిస్తున్నాయి.

పుష్కర్ గాయత్రి దర్శకత్వంలో తెరకెక్కిన మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ‘విక్రమ్ వేద’ సినిమాను తెలుగులో నాగార్జునతో కలిసి రీమేక్ చేయడానికి చిరు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. విజయ్ సేతుపతి క్యారెక్టర్‌లో చిరంజీవి..  మాధవన్ పాత్రలో నాగార్జున నటించబోతున్నారంటూ టాక్. అయితే ఈ సినిమాను తెలుగులో ఎవరు డైరెక్ట్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని వకీల్ సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్నట్టు సమాచారం. ఇప్పటికే చిరు, నాగ్‌లతో కూడిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియలో వైరల్ అయింది.

ఫ్యాన్ మేడ్ పోస్టర్

చిరంజీవి కెరీర్ మొదట్లో ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణరాజు, శోభన్ బాబు, రజనీకాంత్ వంటి హీరోలతో మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. నాగార్జున కూడా కృష్ణ, మోహన్ బాబు, సుమంత్, శ్రీకాంత్, హరికృష్ణ లతో మల్టీస్టార్ సినిమాల్లో నటించారు. ఇండస్ట్రీలో మంచి స్నేహితులైన చిరంజీవి నాగార్జున ఒకే తెరపై కనిపించడం అంటే ఇరువురి ఫ్యాన్స్ కు పండగనే అని చెప్పవచ్చు. ప్రస్తుతం చిరంజీవి నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు నాగార్జున కూడా రెండు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో  విక్రమ్ వేద లో చిరు నాగ్ నటిస్తున్నారు అన్నవార్తలపై ఇరువురు స్పందించాల్సి ఉంది.

Also Read:  నోరే కాదు మనసు కూడా పెద్దదే.. బిగ్ బాస్ రెమ్యునరేష్‌ని క్యాన్సర్ పేషేంట్‌కు ప్రాణం పోసేందుకు ఉమాదేవి డొనేషన్