Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: నోరే కాదు మనసు కూడా పెద్దదే.. బిగ్ బాస్ రెమ్యునరేష్‌ని క్యాన్సర్ పేషేంట్‌కు ప్రాణం పోసేందుకు ఉమాదేవి డొనేషన్

Bigg Boss 5 Telugu: తెలుగు బుల్లి తెరపై బిగ్ బాస్ షో అడుగు పెట్టి.. ఇప్పుడు ఐదో సీజన్ జరుగుతుంది. అయితే మొదటి సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్లు, విన్నర్ తో పాటు.. ఇప్పటికి వరకూ..

Bigg Boss 5 Telugu: నోరే కాదు మనసు కూడా పెద్దదే.. బిగ్ బాస్ రెమ్యునరేష్‌ని క్యాన్సర్ పేషేంట్‌కు ప్రాణం పోసేందుకు ఉమాదేవి డొనేషన్
Umadevi
Follow us
Surya Kala

|

Updated on: Sep 24, 2021 | 11:40 AM

Bigg Boss 5 Telugu: తెలుగు బుల్లి తెరపై బిగ్ బాస్ షో అడుగు పెట్టి.. ఇప్పుడు ఐదో సీజన్ జరుగుతుంది. అయితే మొదటి సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్లు, విన్నర్ తో పాటు.. ఇప్పటికి వరకూ అనేకమంది తమకు వచ్చిన రెమ్యునరేషన్ తో సామజిక కార్యక్రమాలు చేయడమే కాదు.. ఆపదలో ఉన్నవారికి ఆర్ధిక సాయం అందించి అండగా నిలబడ్డారు. షో వేరు.. మానవత్వం వేరు అని నిరూపించారు. శివ బాలాజీ, కౌశిక్  లతో పాటు ఎంతోమంది తమకు ఈ షో ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ ను ఆపదల్లో ఉన్నవారి ప్రాణాలను నిలబెట్టడానికి ఇచ్చారు. అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని.. ఇటీవలే హౌస్ నుంచి బయటకు వచ్చిన ఉమాదేవి కూడా వీరి బాటలోనే పయనించారు.

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు, అనేక సీరియల్స్ లో ఎన్నో పాత్రలు చేసినా రాని గుర్తింపు ఒక్క కార్తీక దీపం సీరియల్లోని అర్ధ పావు భాగ్యంగా అందుకుంది ఉమాదేవి. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 5 లో ఎంట్రీ ఇచ్చింది. అయితే హౌస్ లో అడుగు పెట్టినది మొదలు గయ్యాళి అంటూ పేరుతెచ్చుకున్న ఉమాదేవి హౌస్ లో ఉంది కేవలం రెండు వారాలు మాత్రమే.. అయితేనేమి.. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లను ఓ రేంజ్ లో వణికించింది. మాటకు మాటతో సమాధానం చెబుతూ.. దాదాపు హౌస్ లో ఉన్న అందరి కంటెస్టెంట్లు తోనూ గొడవపడి బిగ్‌బాస్‌ షోలో గయ్యాళి గంపగా పేరు  తెచ్చుకుంది ఉమాదేవి. అయితే ఇటీవల ఆమె షో నుంచి బయటకు వచ్చింది. తనకు వచ్చిన రెమ్యునరేషన్ తో గొప్ప చేసింది. ఓమంచి పని కోసం వినియోగించింది.

బిగ్‌బాస్‌ షో ద్వారా తనకు వచ్చిన పారితోషికంలోని కొంత మొత్తాన్ని బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు ఉమాదేవి అందించింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఉమాదేవి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు.. ఉమాదేవి కి గొంతే కాదు.. మనసు కూడా పెద్దది అంటూ సరదా కామెంట్స్ చేస్తూ.. పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. చిన్నారికి ప్రాణం పోసిన ఉమాదేవికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నారు. మరికొందరు.. ఉమాదేవి మళ్ళీ షో లో ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు కూడా..

Also Read:

మాస్టర్ ప్లాన్ వేస్తున్న మేకర్స్.. కంగనా తలైవికి సీక్వెల్ రానుందా.. ?