Bigg Boss 5 Telugu: పదవతరగతిలోనే అతడితో ఇల్లువదిలి పారిపోయా.. ఎమోషనల్ అయిన సిరి..

బిగ్ బాస్ హౌస్‌లో లవ్ స్టోరీస్ నడుస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే అబ్బాయిలంతా అమ్మాయిలను ఇంప్రస్ చేసే పనిలో ఉన్నారు.

Bigg Boss 5 Telugu: పదవతరగతిలోనే అతడితో ఇల్లువదిలి పారిపోయా.. ఎమోషనల్ అయిన సిరి..
Siri
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 24, 2021 | 7:53 AM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో లవ్ స్టోరీస్ నడుస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే అబ్బాయిలంతా అమ్మాయిలను ఇంప్రస్ చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే హౌస్‌లో ఉన్న వాళ్ళు తమ లవ్ స్టోరీస్ చెప్పుకొచ్చారు. ఒకొక్కరు తమ ప్రేమ గాధలను తెలిపారు. ఈ క్రమంలో సిరి చెప్పిన తన ప్రేమ కథ అందరిని ఆకట్టుకుంది. పదవ తరగతిలో ప్రేమించి అబ్బాయితో వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది సిరి. తన ప్రేమ కథను పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది.. సిరి మాట్లాడుతూ.. నా ఫస్ట్ లవ్ పేరు విష్ణు.. అందరూ అతన్ని ముద్దుగా చిన్నా అంటారు..   అప్పుడు నేను పదో తరగతి చదువుతున్నా. మా ఇంటి ఎదురింటిలోనే అతను ఉండేవాడు. ఓ రోజు అతను నాకు ప్రపోజ్ చేశాడు.. తనంటే నాకూ ఇష్టమే కావడంతో  ఓకే చెప్పేశా.. అయితే తను చాలా పొసిసివ్.. ఎలాగంటే నేను కనీసం కాలేజ్ ఫ్రెండ్స్‌తో మాట్లాడినా తట్టుకోలేకపోయేవాడు. ఈ విషయం పై  మా మధ్య పెద్ద గొడవ కూడా అయ్యింది. ఆ టైమ్ లో నాకు పెళ్లి సంబంధం వచ్చింది.. అతని మీద కోపంతో నేను ఒప్పేసుకున్నాను. అయితే రేపు ఎంగేజ్‌మెంట్ అనగా తను నా దగ్గరకు వచ్చాడు.   ఏడుస్తూ.. నా కాళ్లపై పడిపోయి నాకు నువ్ కావాలి.. నువ్ లేకుండా ఉండలేను. నేను తప్పు చేశా.. అంటూ ఏడ్చేశాడు.

నాకూ తనంటే చాలా ఇష్టం.. తనూ నాకు కావాలని.. తెల్లవారితే ఎంగేజ్ మెంట్ అనగా.. నేను రాత్రికి రాత్రి అతనితో పారిపోయా.. ఆ తరువాత మా అమ్మ నాతో మాట్లాడి వెనక్కి తీసుకుని వచ్చారు. కానీ మేం రిలేషన్ షిప్‌లోనే ఉన్నాము. ఆ రిలేషన్ షిప్ చాలా బాగుంది.. కొన్నాళ్లు అలాగే ఉన్నాం. మధ్యలో గొడవ కూడా అయ్యింది. ఓరోజు ఉదయాన్ని నాకు 3 గంటలకు మెలుకువ వచ్చేసింది.  మళ్లీ పడుకున్నాను ఆ తర్వాత 8 గంటలకు లేచాను. అప్పుడే నాకు షాకింగ్ న్యూస్ తెలిసింది.. విష్ణు చనిపోయాడు అని. నాకు ఎప్పుడైతే మెలుకువ వచ్చిందో ఉదయం 3 గంటలకు అప్పుడే తను యాక్సిడెంట్‌కి గురై చనిపోయినట్టు తెలిసింది. తన కోసం నేను ఎంతో చేశా.. కానీ తనని ఆ దేవుడు నాకు ఇవ్వలేదు. తనని నేను మర్చిపోలేకపోతున్నా.. ఐ లవ్యూ విష్ణు’ అంటూ కన్నీరు మున్నీరు అయ్యింది సిరి. దాంతో హౌస్ లో ఉన్నవాళ్ళంతా ఎమోషనల్ అయ్యారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Love Story Twitter Review: ‘లవ్ స్టోరీ’ సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. మూవీ ఎలా ఉందంటే…

Prabhas: ఆ సినిమా చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.. లవ్‌స్టోరీపై ఆసక్తికర పోస్ట్‌ చేసిన ప్రభాస్‌.

Ram Gopal Varma: ‘మహా సముద్రం’ ట్రైలర్‌ ‘ఆర్‌ఎక్స్‌ 100’లా ఉంది.. ఇంకా పచ్చిగా చెప్పాలంటే. ఆర్జీవీ మాటల్లో ఎలా ఉందంటే..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే