Ram Gopal Varma: ‘మహా సముద్రం’ ట్రైలర్‌ ‘ఆర్‌ఎక్స్‌ 100’లా ఉంది.. ఇంకా పచ్చిగా చెప్పాలంటే. ఆర్జీవీ మాటల్లో ఎలా ఉందంటే..

Ram Gopal Varma: 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్‌లా దూసుకొచ్చాడు దర్శకుడు అజయ్‌ భూపతి. తొలి సినిమాతో తనదైన డైరక్షన్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశాడు. నిజ జీవిత కథ ఆధారంగా..

Ram Gopal Varma: 'మహా సముద్రం' ట్రైలర్‌ 'ఆర్‌ఎక్స్‌ 100'లా ఉంది.. ఇంకా పచ్చిగా చెప్పాలంటే. ఆర్జీవీ మాటల్లో ఎలా ఉందంటే..
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Sep 24, 2021 | 6:40 AM

Ram Gopal Varma: ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్‌లా దూసుకొచ్చాడు దర్శకుడు అజయ్‌ భూపతి. తొలి సినిమాతో తనదైన డైరక్షన్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశాడు. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా అంటూ ‘ఆర్‌ఎక్స్‌ 100’తో ఇండస్ట్రీని ఒక్కసారి షేక్‌ చేశాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు రెండో చిత్రం ‘మహా సముద్రం’తో మరోసారి అలాంటి వండర్‌నే క్రియేట్‌ చేయాలని ఆశతో ఉన్నాడు అజయ్‌.

ఇందులో భాగంగానే ఈసారి ఏకంగా ఇద్దరు హీరోలను రంగంలోకి దించుతున్నాడు. శర్వానంద్‌, సిద్ధార్థ్‌ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీగా అంచనాలున్నాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అజయ్‌ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండేలా ప్లాన్‌ చేసుకున్నాడు. ఓవైపు అదితి రావు హైదరి, అను ఇమ్మన్యూయేల్‌తో పాటు జగపతి బాబు, రావు రమేస్‌ వంటి సీనియర్‌ నటులు ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

మహా సముద్రం ట్రైలర్‌..

ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్‌ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ట్రైలర్‌తో మరోసారి ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. అజయ్‌ రెండోసారి కూడా కచ్చితంగా సక్సెస్‌ కొట్టేలా ఉన్నాడని చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ట్రైలర్‌పై సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ట్వి్ట్టర్‌ వేదికగా తనదైన శైలిలో స్పందించారు. ఈ సినిమా ట్రైలర్‌ లింక్‌ను షేర్‌ చేసిన వర్మ.. ‘హేయ్ అజయ్ భూపతి మహా సముద్రం ట్రైలర్ RX10,000లా ఉంది, ఇంకా పచ్చిగా చెప్పాలంటే దాని అమ్మ మొగుడులా ఉంది అంటూ అడ్వాన్స్ కంగ్రాట్స్’ తెలిపారు. దీంతో వర్మ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక మహాసముద్రం సినిమాను అక్టోబర్ 14న థియేటర్లకు తీసుకురావడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

వర్మ ట్వీట్‌..

Also Read: Singer Yohani: హైదరాబాదీస్‌ గెట్‌ రడీ.. ఆ అద్భుత గాత్రం భాగ్యనగరానికి వచ్చేస్తోంది. ‘మాణికే మాగే హితే’ మార్మోగనుంది. 

Mohan Babu: గతాన్ని నెమరువేసుకుంటే దుఃఖం వస్తుంది.. ఎమోషనల్‌ అయిన మోహన్ బాబు. ఆలీతో ఇంకెన్ని విషయాలు పంచుకున్నారో..

Nivetha Pethuraj: బ్లూ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్ననేచురల్ బ్యూటీ… నివేత పేతురాజ్ గ్రామరస్ ఫొటోస్..