Prabhas: ఆ సినిమా చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.. లవ్‌స్టోరీపై ఆసక్తికర పోస్ట్‌ చేసిన ప్రభాస్‌.

Prabhas: ప్రస్తుతం టాలీవుడ్‌లో 'లవ్‌స్టోరీ' సినిమా గురించే చర్చ నడుస్తోంది. సాయిపల్లవి, నాగచైతన్య జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌...

Prabhas: ఆ సినిమా చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.. లవ్‌స్టోరీపై ఆసక్తికర పోస్ట్‌ చేసిన ప్రభాస్‌.
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Sep 24, 2021 | 6:40 AM

Prabhas: ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘లవ్‌స్టోరీ’ సినిమా గురించే చర్చ నడుస్తోంది. సాయిపల్లవి, నాగచైతన్య జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌ తర్వాత విడుదలవుతోన్న తొలి భారీ చిత్రం ఇదే కావడం, శేఖర్‌ కమ్ముల లాంటి ఫీల్‌ గుడ్‌ డైరక్టర్‌ నుంచి సినిమా వస్తుండడంతో లవ్‌స్టోరీపై అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. అంతేకాకుండా సమాజంలో ఉన్న కులం అనే జాడ్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని దాని చుట్టూ అల్లిన ప్రేమ కథ కావడంతో ఈ సినిమా ఎలా ఉండనుందన్న ఆసక్తి పెరిగింది. ఇక మరికాసేపట్లో ప్రేక్షకులకు ముందుకు వస్తోన్న ఈ సినిమాపై ఇటు కేవలం ప్రేక్షకులే కాకుండా, సెలబ్రిటీలు సైతం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్‌ హీరోహీరోయిన్లు లవ్‌ స్టోరీ చిత్రంపై స్పందించారు.

తాజాగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కూడా ఈ సినిమా గురించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్‌ చేశారు. ‘కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత వెండితెరపై విడుదలవుతోన్న ‘లవ్‌ స్టోరీ’లాంటి సినిమాను చూడడానికి హృదయపూర్వకంగా ఎదురు చూస్తున్నాను. మీ దగ్గర్లోని థియేటర్లలో ఈ సినిమా చూసి నిజమైన సినిమా అనుభూతిని పొందండి. మళ్లీ సినిమా పాత బంగారు రోజులను తిరిగి తీసుకురండి’అంటూ పోస్ట్‌ చేశారు.

ప్రభాస్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

ఇక అంతకుముందు సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కూడా ఈ సినిమాపై స్పందించారు. సినిమా ట్రైలర్‌ను ట్వీట్‌ చేసిన మహేష్‌.. “డ్యాన్స్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. తెలుగులో ఇలాంటివి చాలా అరుదుగా వస్తుంటాయి. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడటానికి నేను ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ‘లవ్ స్టోరీ’ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్” అని క్యాప్షన్‌ జోడించారు.

మహేష్ బాబు ట్వీట్..

ఇదిలా ఉంటే కె నారాయణదాస్ నారంగ్ – పి. రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ సిహెచ్ సంగీతం అందించారు. రాజీవ్ కనకాల – ఈశ్వరీ రావు – దేవయాని – ఉత్తేజ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో చూడాలి.

Also Read: Singer Yohani: హైదరాబాదీస్‌ గెట్‌ రడీ.. ఆ అద్భుత గాత్రం భాగ్యనగరానికి వచ్చేస్తోంది. ‘మాణికే మాగే హితే’ మార్మోగనుంది.

Mohan Babu: గతాన్ని నెమరువేసుకుంటే దుఃఖం వస్తుంది.. ఎమోషనల్‌ అయిన మోహన్ బాబు. ఆలీతో ఇంకెన్ని విషయాలు పంచుకున్నారో..

Nivetha Pethuraj: బ్లూ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్ననేచురల్ బ్యూటీ… నివేత పేతురాజ్ గ్రామరస్ ఫొటోస్..