Singer Yohani: హైదరాబాదీస్‌ గెట్‌ రడీ.. ఆ అద్భుత గాత్రం భాగ్యనగరానికి వచ్చేస్తోంది. ‘మాణికే మాగే హితే’ మార్మోగనుంది.

Singer Yohani: 'మాణికే మాగే హితే'.. దీని అర్థమేంటో ఎవరికీ తెలియకపోయినప్పటికీ గత కొన్నిరోజులుగా అందరి నోళ్లలో ఈ పదం నానుతోంది. కాస్త ఖాళీ సమయం దొరికందంటే యూట్యూబ్‌ ఓపెన్‌ చేసి ఈ పాటను..

Singer Yohani: హైదరాబాదీస్‌ గెట్‌ రడీ.. ఆ అద్భుత గాత్రం భాగ్యనగరానికి వచ్చేస్తోంది. ‘మాణికే మాగే హితే’ మార్మోగనుంది.
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 24, 2021 | 12:03 AM

Singer Yohani: ‘మాణికే మాగే హితే’.. దీని అర్థమేంటో ఎవరికీ తెలియకపోయినప్పటికీ గత కొన్నిరోజులుగా అందరి నోళ్లలో ఈ పదం నానుతోంది. కాస్త ఖాళీ సమయం దొరికందంటే యూట్యూబ్‌ ఓపెన్‌ చేసి ఈ పాటను వింటున్నారు. ఎక్కడో శ్రీలంకలో ఓ యువతి పాడిన పాట ఇంతలా పాపులర్‌ అయ్యిందంటే ఎంత గొప్ప విషయమో ప్రత్యేంగా చెప్పాల్సిన పనిలేదు. పదాలకు అర్థం తెలియదు, అసలు అది ఏ సినిమాలో పాటో తెలియదు కానీ అందరూ ఫిదా అవుతున్నారు. తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా ఈ పాటతో ప్రేమలో పడిపోయారు. ముఖ్యంగా ఈ పాటను ఆలపించిన సింగర్‌ యోహాని తనదైన ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును ఫిదా చేసింది. కొన్ని రోజుల్లోనే ఈ పాట యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడీ అద్భుత గాత్రాన్ని, ఆ గాత్రం వెనకాల ఉన్న అందమైన అమ్మాయిని హైదరాబాదీలు నేరుగా వినే, చూసే అవకాశం దక్కింది. యోహాని డిసిల్వ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఈ పాటకు లైవ్‌ షో ఇవ్వనుంది. గచ్చిబౌలిలోని హార్డ్‌ కప్ కాఫీలో అక్టోబర్‌ 3న నిర్వహించిననున్న కార్యక్రమంలో ‘మాణికే మాగే’తో పాటూ పలు పాటలను ఆలపించనుంది. దీంతో మ్యూజిక్‌ లవర్స్‌ ఈ చాన్స్‌ మిస్‌ చేసుకోకూడదని ఇప్పటి నుంచే ప్లాన్‌లు వేసుకుంటున్నారు.

ఇంతకీ ఎవరీ యోహాని.?

ర్యాపర్‌ అయిన యోహాని శ్రీలంకలోని కొలంబోలో నివసిస్తోంది. యోహాని తండ్రి ఒక ఆర్మీ అధికారి. చిన్ననాటి నుంచి మ్యూజిక్‌ అంటే ఇష్టం ఉన్న ఈ 28 ఏళ్ల సింగర్‌ తన పాటలతో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే యూబ్యూట్‌ చానల్‌ను ఓపెన్‌ చేసి తాను పాడే పాటలను అందులో అప్‌లోడ్‌ చేసింది. ఈ క్రమంలో అప్‌లోడ్‌ చేసిన ‘మాణికే మాగే హితే’ పాట సోషల్‌ మీడియాలో చరిత్ర సృష్టించింది. ఒక్క శ్రీలంకలోనే కాకుండా భారత్‌తో పాటు మరికొన్ని దేశాల్లో ఈ పాట తెగ వైరల్‌గా మారింది. ఇక ఈ పాటను తెలుగుతో పాటు ఇతర భాషల్లోకి తర్జుమా చేసి విడుదల చేశారు. ఈ పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి.

తెలుగు వెర్షన్ సాంగ్..

Also Read: Mohan Babu: గతాన్ని నెమరువేసుకుంటే దుఃఖం వస్తుంది.. ఎమోషనల్‌ అయిన మోహన్ బాబు. ఆలీతో ఇంకెన్ని విషయాలు పంచుకున్నారో..

Naga Chaitanya: లవ్ స్టోరీ సినిమాలో అవే కీలకం.. అందమైన ప్రేమకథ గురించి నాగ చైతన్య చెప్పిన ఆసక్తికర విషయాలు..

Nivetha Pethuraj: బ్లూ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్ననేచురల్ బ్యూటీ… నివేత పేతురాజ్ గ్రామరస్ ఫొటోస్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ