AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: లవ్ స్టోరీ సినిమాలో అవే కీలకం.. అందమైన ప్రేమకథ గురించి నాగ చైతన్య చెప్పిన ఆసక్తికర విషయాలు..

లవ్ స్టోరీ.. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న సినిమా.. ఎట్టకేలకు రేపు రిలీజ్ కాబోతుంది. వరుసగా వాయిదా పడుతు వచ్చిన

Naga Chaitanya: లవ్ స్టోరీ సినిమాలో అవే కీలకం.. అందమైన ప్రేమకథ గురించి నాగ చైతన్య చెప్పిన ఆసక్తికర విషయాలు..
Lovestory
Rajitha Chanti
|

Updated on: Sep 23, 2021 | 9:20 PM

Share

లవ్ స్టోరీ.. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న సినిమా.. ఎట్టకేలకు రేపు రిలీజ్ కాబోతుంది. వరుసగా వాయిదా పడుతు వచ్చిన ఈ మూవీ రేపు (సెప్టెంబర్ 24న) థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టించాయి. అన్ని అడ్డంకులను దాటుకుని చైతూ.. సాయి పల్లవిల అందమైన ప్రేమకథ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో ఈ సినిమా గురించి నాగచైతన్య కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నాగ చైతన్య మాట్లాడుతూ.. దర్శకుడు శేఖర్ కమ్ముల గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో పనిచేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. శేఖర్ గారి చిత్రాల్లో రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. రియలిస్టిక్ చిత్రాలంటే నాకు ఆసక్తి. మజిలీ సినిమాలో ఈ సంతృప్తి కొంత దొరికింది. లవ్ స్టోరితో నెక్ట్ లెవెల్ హ్యాపీనెస్ పొందాను అంటూ చెప్పుకొచ్చారు.

లవ్ స్టోరి సినిమాలో మహిళలకు సంబంధించిన ఓ సెన్సిటివ్ ఇష్యూను దర్శకుడు శేఖర్ కమ్ముల గారు చెప్పబోతున్నారు. జెండర్ బయాస్, కాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి కథలో ఇంపార్టెన్స్ ఉంటుంది. పల్లవి అనే క్యారెక్టర్ ద్వారా ఈ విషయాన్ని కొన్ని చూపిస్తున్నాము. శేఖర్ కమ్ముల గారు చాలా కంఫర్ట్ ఇచ్చి సినిమా చేయించారు. ఆయనతో పనిచేసిన తర్వాత ఒక నటుడిగా, పర్సన్‏గా ఎదిగాను. చాలా విషయాలు నేర్చుకున్నాను. అందుకే ఆయనతో ఎక్కడిదాకా అయినా ట్రావెల్ చేస్తాను అని ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో చెప్పాను. ఈ సినిమాలో నేను తెలంగాణ యాసలో మాట్లాడుతాను. ఈ యాస కోసం కొన్ని రోజుల పాటు ప్రాక్టిస్ సెషన్స్ చేశాము. ఇక డబ్బింగ్ చెప్పే టైమ్ కు లాక్ డౌన్ వచ్చి, ఈ యాస మరింత స్పష్టంగా నేర్చుకునేందుకు వీలు దొరికిందని తెలిపారు.

అలాగే శేఖర్ గారి గత చిత్రాల్లో హీరోయిన్ క్యారెక్టర్‏కు ఎక్కువ పేరొస్తుంది. కానీ లవ్ స్టోరిలో సాయి పల్లవితో పాటు నా క్యారెక్టర్‏కు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇద్దరికీ మంచి పేరొస్తుంది. సాయి పల్లవితో నటించడం ఎంజాయ్ చేశాను. తను గుడ్ ఆర్టిస్ట్, డాన్సర్. అంతేకాకుండా.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నా కాంబినేషన్ శైలజా రెడ్డి అల్లుడు సినిమా నుంచి బాగా వర్కవుట్ అవుతోంది. లవ్ స్టోరీలోనూ మంచి స్టెప్పులు చేయించారు. పాటలన్నీ చాలా సిచ్యువేషనల్‏గా ఉంటాయి. డాన్సులు కూడా వాటికి తగినట్లు సహజంగా కంపోజ్ చేశారు.

ఇటీవల సుకుమార్ గారితో మాట్లాడుతున్నప్పుడు నేచురల్ అప్రోచ్ ఉన్న సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతోందనే విషయం మీద మాట్లాడుకున్నాం. సుకుమార్ గారు కూడా నాకు అదే సజెషన్ ఇచ్చారు. తను కూడా రంగస్థలం నుంచి ఇదే ఫార్మేట్‏లో సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు. మంచి కథలు దొరికితే ఇతర భాషల్లో నటిస్తాను. అమీర్ ఖాన్ గారితో లాల్ సింగ్ చద్దా లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ప్రీ రిలీజ్‏ ఈవెంట్‏కు వచ్చి మా సినిమా గురించి బాగా చెప్పారు. ఆయన అపాయింట్ మెంట్ కోసం చూస్తున్నాం. దొరికితే లవ్ స్టోరి సినిమాను చూపిస్తామని చెప్పుకొచ్చారు చైతూ..

Also Read: Maha Samudram: మహా యుద్ధం మొదలు.. ఆసక్తికరంగా మహా సముద్రం ట్రైలర్.. డైలాగ్స్ అదుర్స్..

Naga Chaitanya: ఎట్టకేలకు స్పందించిన నాగచైతన్య..  తనపై వస్తున్న రూమర్స్ గురించి ఏం చెప్పాడంటే..