Maha Samudram: మహా యుద్ధం మొదలు.. ఆసక్తికరంగా మహా సముద్రం ట్రైలర్.. డైలాగ్స్ అదుర్స్..

Maha Samudram Trailer: టాలెంటెడ్ హీరో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం మహా సముద్రం. ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న

Maha Samudram: మహా యుద్ధం మొదలు.. ఆసక్తికరంగా మహా సముద్రం ట్రైలర్.. డైలాగ్స్ అదుర్స్..
Maha Samudram
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 23, 2021 | 7:27 PM

టాలెంటెడ్ హీరో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం మహా సముద్రం. ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ మహాసముద్రం మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా అదితీరావు .. అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. తాజాగా మహా సముద్రం ట్రైలర్‏ను విడుదల చేశారు.

తాజాగా విడుదలైన ట్రైలర్‏లో సిద్ధార్థ్, శర్వానంద్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే లవ్, యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది. అలాగే ఇందులో జగపతి బాబు, రావు రమేష్, సిద్ధార్థ్, అదితి రావు, అను ఇమాన్యుయేల్, శర్వానంద్ పాత్రలను ట్రైలర్‏లోనే చూపించేశారు. మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా? అంటూ జగపతి బాబును సిద్దార్థ్ నిలదీసే సీన్ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా.. శర్వానంద్‌ను ఉద్దేశించి హీరోయిన్ చెప్పె డైలాగ్.. నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా.. అందరూ నీ దగ్గరికే రావాలని అనుకుంటారు.. అలాగే చిన్నప్పుడు దూరదర్శన్‌లో మహా భారతం సీరియల్‌ను చూశాను. ఎత్తులకు పై ఎత్తులు, బాణాలు వేయడం నేర్చుకున్నాను అంటూ రావు రమేష్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. మొత్తానికి తాజాగా విడుదలైన ట్రైలర్‏తో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశారు మేకర్స్.

ట్రైలర్..

ట్వీట్..

Also Read: Naga Chaitanya: ఎట్టకేలకు స్పందించిన నాగచైతన్య..  తనపై వస్తున్న రూమర్స్ గురించి ఏం చెప్పాడంటే.. 

Maa Elections 2021: మా ఎన్నికల్లో ట్విస్ట్.. జీవిత మీద ఎలక్షన్ ఆఫీసర్‏కి ఫిర్యాదు చేసిన పృథ్వి.. ఎందుకంటే..