Maa Elections 2021: మా ఎన్నికల్లో ట్విస్ట్.. జీవిత మీద ఎలక్షన్ ఆఫీసర్‏కి ఫిర్యాదు చేసిన పృథ్వి.. ఎందుకంటే..

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోషియన్ ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో అభ్యర్థులు వేగం పెంచారు. ప్రచారాలు... సమావేశాలతో

Maa Elections 2021: మా ఎన్నికల్లో ట్విస్ట్.. జీవిత మీద ఎలక్షన్ ఆఫీసర్‏కి ఫిర్యాదు చేసిన పృథ్వి.. ఎందుకంటే..
Jeevitha
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 23, 2021 | 5:05 PM

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోషియన్ ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో అభ్యర్థులు వేగం పెంచారు. ప్రచారాలు… సమావేశాలతో ఓట్లను రాబట్టే పనిలో పడ్డారు. ప్రస్తుతం బరిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, సీవిఎల్ మధ్య పోటీ రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా.. మీడియా సమావేశాలలో బహిరంగా విమర్శలు చేసుకుంటున్నారు. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులను ప్రకటించారు. ఇదిలా ఉంటే.. మా ఎన్నికలలో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులైన జీవితా రాజశేఖర్ మీద చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ ఆఫీసర్‏కు సీనియర్ నటుడు పృథ్వీ లేఖ రాయడం ఇప్పుడు టాలీవుడ్‏లో చర్చనీయాంశంగా మారింది.

గతంలో జీవితా రాజశేఖర్ మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె పోటీ నుంచి తప్పుకుని ప్రకాష్ రాజ్ ప్యానల్లో చేరారు. అయితే తాజాగా మంచు విష్ణు ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్‏గా పోటీ చేస్తున్న పృథ్వి.. జీవితపై ఎలక్షన్ ఆఫీసర్‏కు ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ ఆఫీసర్‏కు పంపిన లేఖలో పృథ్వీ.. జీవితపై చర్యలు తీసుకోవాలని కోరారు. నేనెప్పుడూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ నిబంధనలకు కట్టుబడి ఉంటాను. కానీ ఈ మధ్య ప్రస్తుతం మా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న జీవిత ప్రస్తుతం ఆమె చేస్తున్న కార్యకలాపాల మీద మాట్లాడాల్సి వస్తోంది. జీవిత ప్రకాష్‌రాజ్‌ ప్యానల్‌లో జాయింట్‌ సెక్రటరీగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడున్న పొజిషన్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకుని ఆమె కొందరిని ఇన్‌ఫ్లుయన్స్ చేస్తున్నారు. మా ఆఫీస్‌ని ఎన్నికల కాంపెయిన్‌కి వాడుకుంటున్నట్టు తెలిసింది. టెంపరరీ ఐడీ కార్డులు ఇస్తామని జీవిత కొందరిని మభ్యపెడుతున్నారు. తనకు ఓటేస్తే ఇలాంటి లాభాలుంటాయని చెబుతున్నారు. ఈ విషయం మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఎన్నికల రూల్స్, కండక్ట్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ పృథ్వీ బహిరంగ లేఖ రాసారు.

Whatsapp Image 2021 09 23 At 3.34.05 Pm (1)

Also Read: 96 Movie: బాలీవుడ్‎లోకి సేతుపతి మూవీ.. సూపర్ హిట్ 96 సినిమా రీమేక్..

పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?