Naga Chaitanya: ఎట్టకేలకు స్పందించిన నాగచైతన్య..  తనపై వస్తున్న రూమర్స్ గురించి ఏం చెప్పాడంటే.. 

అక్కినేని నాగచైతన్య.. టాలెండ్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన సినిమా లవ్ స్టోరీ. క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న

Naga Chaitanya: ఎట్టకేలకు స్పందించిన నాగచైతన్య..  తనపై వస్తున్న రూమర్స్ గురించి ఏం చెప్పాడంటే.. 
Nagachaitanya


అక్కినేని నాగచైతన్య.. టాలెండ్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన సినిమా లవ్ స్టోరీ. క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ అందమైన ప్రేమ కథ కోసం గత కొద్ది నెలలుగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ యువతకు తెగ ఆకట్టుకుంది. దీంతో లవ్ స్టోరీ మూవీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఎట్టకేలకు ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. ఎన్నో వాయిదాల అనంతరం రేపు (సెప్టెంబర్ 24న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇక ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ అనంతరం నాగచైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈక్రమంలో తాజాగా చైతూ.. తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

గాసిప్స్ కోసం తన పేరును వాడుకోవడం కొంత బాధగా అనిపించిందని హీరో నాగచైతన్య అన్నారు. ప్రతి ఒక్కరికీ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలు ఉంటాయని అన్నారు. ఆ రెండింటినీ తాను వేర్వేరుగానే చూస్తానని తెలిపారు. నటుడిగా కెరీర్ ప్రారంభించిన సమయంలోనే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‏ను వేర్వేరుగా చూడడం నేర్చుకున్నాను. ఆ రెండింటీని కలిపి చూడను. ఈ విషయాన్ని మా తల్లిదండ్రుల నుంచి తెలుసుకున్నాను. షూటింగ్స్ లేదా ఇతర బిజినెస్ వర్క్స్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్లిద్దరూ ఆ విషయాల గురించి చర్చించుకోరు. అదే మాదిరిగా పనిలో నుంచి రాగానే పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించరు అని చైతూ చెప్పుకొచ్చారు. అలాగే గత కొద్దిరోజులుగా తనపై వస్తున్న వార్తలపైనూ స్పందించారు. ఒకానొక సమయంలో నాపై ఎన్నో అసత్య వార్తలు వచ్చాయి. వాటిని చూసి కొంత బాధపడ్డా. ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు ? అనుకున్నా. పాత రోజుల్లో మ్యాగజైన్స్ ఉండేవి. నెలకో మ్యాగజైన్ వచ్చేది. దానివలన ఒక నెలంతా అదే వార్త వినిపిస్తుండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. క్షణాల్లోనే ఒక వార్త మరోక వార్తను రీప్లేస్ చేస్తుంది. ఎన్ని వార్తలు వచ్చిన వాస్తవాలు మాత్రమే ప్రజలకు గుర్తుంటాయని అర్థమైనప్పటి నుంచి నేను వాటి గురించి పట్టించుకోవడం లేదు అంటూ చెప్పుకోచ్చారు చైతన్య.

ఇదిలా ఉంటే.. గత కొద్దిరోజులుగా నాగచైతన్య, సమంతల బంధం గురించి సోషల్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. వీరిద్ధరి మధ్య విభేదాలు వచ్చాయని.. విడాకులు కూడా తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. వీటి పై అటు సమంతగానీ.. ఇటు అక్కినేని కుటుంబం ఇప్పటివరకు స్పంధించలేదు.. ఏమాయ చేసావే సినిమాలో సమంత, చైతన్య కలిసి నటించిన సంగతి తెలిసిందే. 2017లో వీరిద్దరి ప్రేమవివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అలాగే తమిళంలో కథువాకుల రెండు కాదల్ సినిమాలో నటిస్తోంది.

Also Read: Maa Elections 2021: మా ఎన్నికల్లో ట్విస్ట్.. జీవిత మీద ఎలక్షన్ ఆఫీసర్‏కి ఫిర్యాదు చేసిన పృథ్వి.. ఎందుకంటే..

Suma Kanakala New Photos: యాంకర్ సుమ లేటెస్ట్ ఫోటోలు.. లంగా వోణిలో మెరిసిన ముద్దుగుమ్మ..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu