Bigg Boss 5 Telugu: ఈసారి బిగ్‌బాస్‌కు ఏమైంది.. ఇన్ని తప్పులు జరుగుతున్నాయేంటి..?
అసలు బిగ్‌బాస్‌కు ఏమైంది ? ఈసారి ఆటపై పెద్ద బాస్‌కు ఇంట్రెస్ట్ లేదా ? షోపై ఆసక్తి చూపించడం లేదా ? కంటెస్టెంట్స్ తీరుపై ఎందుకు ఇప్పటికీ
అసలు బిగ్‌బాస్‌కు ఏమైంది ? ఈసారి ఆటపై పెద్ద బాస్‌కు ఇంట్రెస్ట్ లేదా ? షోపై ఆసక్తి చూపించడం లేదా ? కంటెస్టెంట్స్ తీరుపై ఎందుకు ఇప్పటికీ నోరు మెదపడం లేదు ? అనే సందేహాలు ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా బిగ్‌బాస్ ఇంట్లోకి రావడానికి ముందే షో నియమ నిబంధనల గురించి కంటెస్టెంట్స్‌కు తెలియజేస్తుంటారు. అందులో ఒకటి కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అనేది. ఒకవేళ ఇంట్లోకి వచ్చాక కూడా సభ్యులు ఇంగ్లీష్, హిందీ మాట్లాడితే కచ్చితంగా హెచ్చరిస్తారు. కానీ ఈసారి సీజన్ 5 ప్రారంభమై… మూడు వారాలు గడుస్తున్నా.. ఇప్పటికీ కంటెస్టెంట్స్ తీరులో మార్పు రాలేదు. ఇప్పటికీ ఇష్టానుసారంగా ఇంగ్లీష్, హిందీలోనే మాట్లాడుతున్నారు. ఒక్క పదం అంటే ఏమో అనుకోవచ్చు.. కానీ ఇద్దరి మధ్య సంభాషణ జరగాలంటే.. ఇంగ్లీష్, హిందీనే ఎంచుకుంటున్నారు. దీంతో వారు మాట్లాడేది అర్థం కాక ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు. బిగ్‌బాస్ ఒక్కసారి చెప్పండి… నాగార్జున సర్ మీరైన గుర్తుచేయండి ఇది తెలుగు షో అంటూ సోషల్ మీడియాలో తమ గోడు వెల్లబోస్తున్నారు.
అలాగే కంటెస్టెంట్స్ సభ్యులు ఎక్కువగా బూతులు మాట్లాడేస్తున్నారు.. దీంతో ప్రతిసారీ బీప్ సౌండ్ వెయాల్సి వస్తుందనేది మరో వాదన. ఇవే కాకుండా.. బిగ్‌బాస్ సైతం ప్రతిసారి పప్పులో కాలేస్తున్నాడు. చిన్న చిన్న పొరపాట్లతో నెటిజన్లకు అడ్డంగా దొరికిపోతున్నాడు. ఇంతకు ముందు సీజన్లలో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోతోనే ఆసక్తిని కలిగించేవాడు… కానీ ఈసారి అలా జరగడం లేదు. గత సీజన్లలో ప్రోమోకు.. ఎపిసోడ్‌కు అస్సలు సంబంధం ఉండేది కాదు. ప్రోమో కట్ చేసే విషయంలో ప్రతిసారీ ఎంతో జాగ్రత్త తీసుకునే బిగ్‌బాస్ ఈసారి పెద్దగా పట్టించుకోవడం లేదన్నట్టుగా తెలుస్తోంది. ఈసారి వరుసగా తదుపరి కెప్టెన్ ఎవరు అనేదానిపై ముందే లీక్ చేస్తున్నాడు. ఇటీవల విశ్వ విషయంలో పొరపాటు చేసిన బిగ్‌బాస్ తాజాగా.. మరోసారి నెక్ట్స్ కెప్టెన్ విషయంలోనూ అడ్డంగా దొరికిపోయాడు. తాజాగా ఈరోజు విడుదలైన ప్రోమోలో తదుపరి కెప్టెన్ ఎవరనేదానిపై క్లారిటీ ఇచ్చేసాడు. ఈరోజు విడుదలైన ప్రోమోలో జెస్సీ కెప్టెన్సీ బ్యాండ్ ధరించి ఉన్నాడు. అంటే ఈ వారం కెప్టెన్ జెస్సీ అయ్యాడని ముందుగానే రివీల్ చేశాడు బిగ్‌బాస్. ఇంకేముంది నెటిజన్స్ ఊరుకుంటారా.. నెట్టింట్లో బిగ్‌బాస్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. వరుస పెట్టి ఇలా ముందే రివీల్ చేస్తున్నావేంటీ బిగ్‌బాస్ ?.. అంటూ ఆడుకుంటున్నారు. అలాగే.. ఈసారి జెస్సీ కెప్టెన్ కావడంతో అతని అభిమానులు సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు. మొత్తానికి ఈసారి బిగ్‌బాస్ ప్రోమోల విషయంలో.. కంటెస్టెంట్స్ మాట్లాడే భాష విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా లేదని మరికొందరు అంటున్నారు.
ప్రోమో..
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
Also Read: Naga Chaitanya: ఎట్టకేలకు స్పందించిన నాగచైతన్య.. తనపై వస్తున్న రూమర్స్ గురించి ఏం చెప్పాడంటే..