Bigg Boss5: ఆమె సింగిల్.. ఏమైనా చెయ్యొచ్చు.. లహరిపై ప్రియ షాకింగ్‌ కామెంట్స్‌.. వీడియో

Bigg Boss5: ఆమె సింగిల్.. ఏమైనా చెయ్యొచ్చు.. లహరిపై ప్రియ షాకింగ్‌ కామెంట్స్‌.. వీడియో

Phani CH

|

Updated on: Sep 23, 2021 | 9:58 AM

బిగ్ బాస్‌లో సెప్టెంబర్ 20వ తేదీ ఎపిసోడ్ రచ్చ రచ్చగా సాగింది. హౌస్‌ మెంబర్స్‌ అంతా ప్రియను టార్గెట్ చేశారు. అయినా వెనక్కు తగ్గని ప్రియ అందరికీ ధీటుగా సమాధానమిచ్చింది.

బిగ్ బాస్‌లో సెప్టెంబర్ 20వ తేదీ ఎపిసోడ్ రచ్చ రచ్చగా సాగింది. హౌస్‌ మెంబర్స్‌ అంతా ప్రియను టార్గెట్ చేశారు. అయినా వెనక్కు తగ్గని ప్రియ అందరికీ ధీటుగా సమాధానమిచ్చింది. లహరిపై షాకింగ్‌ కామెంట్స్ చేసిన ప్రియ హౌస్‌లో ఆమె ఎప్పుడూ అబ్బాయిలతో బిజీగా ఉంటుంది.. మహిళలతో మాట్లడదని చెప్పింది. దాంతో వెంటనే తగులుకున్న లహరి ఎవరితో బిజీగా ఉన్నానో చెప్పమంటూ డిమాండ్‌ చేసింది. దాంతో రవి పేరు చెప్పింది ప్రియ. రవితో నేను ఏంచేశానో చెప్పమంటూ లహరి అనడంతో.. ‘నువ్ రవితో రెస్ట్ రూంలో లేట్ నైట్ హగ్ చేసుకుంటూ ఉన్నావు.. అది ఫ్రెండ్లీ హగ్ అయినా అయ్యి ఉండొచ్చు.. ఏమైనా అయ్యి ఉండొచ్చు అంది ప్రియ. దాంతో అంతా షాక్ అయ్యారు. వెంటనే అందుకున్న రవి ఏం మట్లాడుతున్నావు అక్కా అంటూ అడిగాడు. ‘మీరు హగ్ చేసుకున్నది మిడ్ నైట్ కాదా? టాయ్ లెట్‌లో కాదా? అని తిరిగి ప్రశ్నించింది ప్రియ. ఆతర్వాత మరో సారి ప్రియ నోరు జారింది. నీకు ఇంతకు ముందుకూడా చెప్పా.. ఆమె సింగిల్ ఏమైనా చెయ్యొచ్చు కానీ నువ్వు అలా కాదు అంది ప్రియ.. దాంతో రవి సహనం కోల్పోయిన రవి.. రాంగ్ స్టేట్ మెంట్.. రాంగ్ స్టేట్ మెంట్ అని గట్టిగా అరిచాడు.

మరిన్ని ఇక్కడ చూడండి: Acharya Movie: ముందే వస్తున్న ఆచార్య.. రిలీజ్‌ ఎప్పుడంటే..!! వీడియో

అదృష్టం అంటే ఇదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఆటో డ్రైవర్‌.. వీడియో

Published on: Sep 23, 2021 09:32 AM