Sai Dharam Tej: సాయికి చేయూతగా సేనాని.. మేనల్లుడి కోసం రంగంలోకి పవర్ స్టార్..
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం రిపబ్లిక్. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవ్ కట్టా

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం రిపబ్లిక్. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవ్ కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నిట్సోతంది. ఇందులో సాయి ధరమ్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ఈ మూవీలో రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి.
ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ పనులను సైతం పూర్తిచేసుకుంది. ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ లభించింది. ఇక గాంధీ జయింతిని పురస్కరించుకుని ఈ మూవీని అక్టోబర్ 1న తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అపోలోలో చికిత్స తీసుకుంటున్న తేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఇక తేజ్ కోసం మెగా ఫ్యామిలీ హీరోలందరూ కదిలివస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ఈ మూవీ ట్రైలర్ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారింగా ప్రకటించింది. ఈ నెల 25న (శనివారం) రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు జనసేనాని ముఖ్య అతిథిగా రాబోతున్నారంటూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్.
వీడియో..
The Pre-release event of #Republic turns massive with the presence of Shri @PawanKalyan.
Event – 25th Sept from 6PM Venue: JRC CONVENTION, HYD.#RepublicFromOct1st#PawanKalyanForSDT@IamSaiDharamTej @aishu_dil @IamJagguBhai @meramyakrishnan@devakatta @JBEnt_Offl@ZeeStudios_ pic.twitter.com/8pRJFmZPpg
— JB Entertainments (@JBEnt_Offl) September 23, 2021
Also Read: Maha Samudram: మహా యుద్ధం మొదలు.. ఆసక్తికరంగా మహా సముద్రం ట్రైలర్.. డైలాగ్స్ అదుర్స్..
Bigg Boss 5 Telugu: ఈసారి బిగ్బాస్కు ఏమైంది.. ఇన్ని తప్పులు జరుగుతున్నాయేంటి..?