Kangana Ranaut : మాస్టర్ ప్లాన్ వేస్తున్న మేకర్స్.. కంగనా తలైవికి సీక్వెల్ రానుందా.. ?

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా తలైవి. సినీనటి, రాజకీయనాయకురాలు జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

Kangana Ranaut : మాస్టర్ ప్లాన్ వేస్తున్న మేకర్స్.. కంగనా తలైవికి సీక్వెల్ రానుందా.. ?
Kangana
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 24, 2021 | 11:23 AM

Thalaivii: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా తలైవి. సినీనటి, రాజకీయనాయకురాలు జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్‌తో నడిచింది. ఇక ఈ సినిమాలో అలనాటి నటుడు, రాజకీయ నాయకుడు అయిన ఎంజీఆర్ క్యారెక్టర్‌లో విలక్షణ నటుడు అరవిద స్వామి నటించారు. ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించగా.. విబ్రి మీడియా- కర్మ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిచాయి. తమిళంలో ఓ మాదిరిగా ఆడిన ‘తలైవి’.. తెలుగు హిందీ భాషల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్కు మంచి ఆఫర్లు వచ్చినా సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

జయలలిత నట జీవితంతో పాటు రాజకీయ ప్రయాణంలో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యే వరకే ఈ సినిమాలో చూపించారు. ఇక ఇప్పుడు ఆమె జీవితంలో మిగిలిన ఘట్టాన్ని చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిన ఆరోపణలు ఎదుర్కొన్న వివాదాలను ప్రస్తావిస్తూ.. సీక్వెల్ తెరకెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఇక ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ తో సీక్వెల్ కోసం స్క్రిప్టు రెడీ చేయిస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఈ సీక్వెల్‌కు సంబంధించిన అప్ డేట్ ఇవ్వనున్నారని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shyam Singha Roy: ఈ సారి నెట్‌ఫ్లిక్స్‌కు ఓటేసిన నాని.. భారీ ధరకు శ్యామ్ సింగరాయ్ డిజిటల్ రైట్స్..

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ ఎత్తుకున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Bigg Boss 5 Telugu: పదవతరగతిలోనే అతడితో ఇల్లువదిలి పారిపోయా.. ఎమోషనల్ అయిన సిరి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే