Shyam Singha Roy: ఈ సారి నెట్‌ఫ్లిక్స్‌కు ఓటేసిన నాని.. భారీ ధరకు శ్యామ్ సింగరాయ్ డిజిటల్ రైట్స్..

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్.. టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Shyam Singha Roy: ఈ సారి నెట్‌ఫ్లిక్స్‌కు ఓటేసిన నాని.. భారీ ధరకు శ్యామ్ సింగరాయ్ డిజిటల్ రైట్స్..
Nani
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 24, 2021 | 9:04 AM

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్.. టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సాయి పల్లవి.. మడోనా సెబాస్టియన్.. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు సినిమా పై ఆసక్తిని పెంచాయి. శం సింగరాయ్ సినిమాలో నాని డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నాడు. ప్రియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది.

నాని నటించిన ‘వి’ సినిమా అలాగే శివనిర్వాణ  దర్శకత్వంలో వచ్చిన ‘టక్ జగదీష్’ సినిమాలు ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలో అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమాను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లోనే విడుదల చేయాలని నాని చూస్తున్నాడు. నాని కెరీర్‌లోనే ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత వెంకట్ బోయనపల్లి  ఈసినిమాను నిర్మిస్తున్నారు. జిషు సేన్ గుప్తా – రాహుల్ రవీంద్రన్ – మురళీ శర్మ – అభినవ్ గోమటం ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ ఎత్తుకున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Bigg Boss 5 Telugu: పదవతరగతిలోనే అతడితో ఇల్లువదిలి పారిపోయా.. ఎమోషనల్ అయిన సిరి..

Love Story Twitter Review: ‘లవ్ స్టోరీ’ సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. మూవీ ఎలా ఉందంటే…