Rashmi Rocket Trailer: లేడీ అథ్లెట్‌గా అదరగొట్టిన తాప్సీ.. ఆకట్టుకుంటున్న ‘రష్మీ రాకెట్’ ట్రైలర్…

సినిమా ఇండస్ట్రీలో గ్లామర్‌తో మాత్రమే కాకుండా టాలెంట్‌తో రాణిస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో తాప్సీ ఒకరు.

Rashmi Rocket Trailer: లేడీ అథ్లెట్‌గా అదరగొట్టిన తాప్సీ.. ఆకట్టుకుంటున్న 'రష్మీ రాకెట్' ట్రైలర్...
Taapsee
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 24, 2021 | 10:44 AM

Rashmi Rocket trailer: సినిమా ఇండస్ట్రీలో గ్లామర్‌తో మాత్రమే కాకుండా టాలెంట్‌తో రాణిస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో తాప్సీ ఒకరు. ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్‏గా టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ.. ఆ తర్వాత సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది. ఇక ఇటు తెలుగులో మంచి ఫాంలో ఉన్న సమయంలోనే అటు బాలీవుడ్‏లోనూ అవకాశాలను అందుకుంది తాప్సీ. అదే సమయంలో అక్కడ ఆమెకు సూపర్ హిట్స్ లభించడంతో.. పూర్తిగా బాలీవుడ్‏కు షిఫ్ట్ అయ్యింది ఈ పంజాబీ బ్యూటీ. అటు వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ ఫ్లాట్‏ఫాంలలోనూ తాప్సీ దూసుకుపోతుంది. అలాగే తమిళ్‌‌‌‌లోనూ సినిమాలు చేస్తోంది. ఇక ఈ చిన్నది లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకుంటోంది. ఇటీవలే తమిళ్ లో విజయ్ సేతుపతితో కలిసి అనేబెల్లా సేతుపతి సినిమాలో చేసింది ఈ సొట్టబుగ్గల సిందరి. ఇక ఇప్పుడు బాలీవుడ్ మూవీ రష్మీ రాకెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు చిత్రయూనిట్.

ఆకర్ష్ ఖురానా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అథ్లెట్‌గా కనిపించనుంది తాప్సీ. ఓ లేడీ అథ్లెట్ తన లక్ష్యం చేరడం కోసం ఎలాంటి అవాంతరాల్ని ఎదుర్కొంది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. సమాజం ముందు దోషిగా నిలబడిన రష్మీ హ్యుమన్ రైట్స్‌ని ఆశ్రయించి ఎలాంటి పోరాటాన్ని చేసింది.. తిరిగి ఎలా తన కలని నిజం చేసుకుంది.. అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. గ్రామీణ స్థాయి నుంచి వెళ్లి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం కోసం అవమానాలు ఎదుర్కొన్న కొంత మంది అథ్లెట్ల జీవితాలని స్ఫూర్తిగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఆకర్ష్ ఖురానా. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shyam Singha Roy: ఈ సారి నెట్‌ఫ్లిక్స్‌కు ఓటేసిన నాని.. భారీ ధరకు శ్యామ్ సింగరాయ్ డిజిటల్ రైట్స్..

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ ఎత్తుకున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Bigg Boss 5 Telugu: పదవతరగతిలోనే అతడితో ఇల్లువదిలి పారిపోయా.. ఎమోషనల్ అయిన సిరి..