Telangana Meat Shops: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ప్రభుత్వం ఆధీనంలో మాంసం అమ్మకాలు.. ఎందుకోసమంటే..?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్రంలో అన్ని మాంసం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని పశుసంవర్ధక శాఖ యోచిస్తోంది.
Telangana Meat Shops: ప్రస్తుత సమయంలో ప్రతీ ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాటి కోసం శాఖాహారులైతే డ్రై ప్రూట్స్, మాంసాహారులలైతే నాన్ వెజ్ తింటున్నారు. ఈ క్రమంలోనే మాంసం వినియోగం పెరిగిపోయింది. దీంతో దుకాణాలు గల్లీకి ఒకటి వెలిచాయి. అయితే, ఒక్కో షాప్‌లో మాంసం ధరలు ఒక్కో విధంగా ఉంటున్నాయి. ఒక దగ్గర తక్కువ ధరకు విక్రయిస్తుంటే.. మరోచోట ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అయితే, వినియోగదారునికి సరసమైన ధరల్లో.. పరిశుద్ధమైన మాంసం అందించడం లక్ష్యంగా తెలంగాణ పశుసంవర్ధకశాఖ అడుగులు వేస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్రంలో అన్ని మాంసం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని పశుసంవర్ధక శాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగానే మొదటగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కబేళాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతిజోన్ పరిధిలో ఒక కబేళా, జిల్లాల్లో ఒకటి లేదా రెండు ఏర్పాటుచేయాలని భావిస్తోంది. వీటిని స్థానికంగా ఉండే మటన్ దుకాణాలకు లింక్ చేసి.. అక్కడి నుంచే మాంసం సరఫరా చేయనున్నారు. దుకాణదారులు ప్రభుత్వం అందించిన మాంసాన్నే విక్రయించాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు అమ్మాల్సి ఉంటుంది. దీనిద్వారా వినియోగదారులకు శుద్ధమైన మాంసం అందడంతోపాటు, తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 10 వేలదాకా మటన్ షాపులు నడుస్తున్నాయి. ఇందులో రెండువేల దుకాణాలను మాత్రమే ప్రభుత్వ అనుమతితో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ షాపులన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలోకి తేవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ షాపులన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలోకి తేవాలని భావిస్తున్నారు. కేవలం మాంసం దుకాణాలే కాకుండా చేపలను కూడా కొని విక్రయించేందుకు చర్యలు తీసుకోనున్నారు. తెలంగాణలో మత్స్యసంపద భారీగా పెరిగినప్పటికీ.. మత్స్యకారులకు మాత్రం అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదనే అభిప్రాయం ఉంది. దుకాణాల ఆధునికీకరణకు అవసరమైతే బ్యాంకుల నుంచి రుణం కూడా ఇప్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ప్రతీ మాంసం దుకాణాల్లో రిఫ్రిజిరేటర్ ను అందుబాటులో ఉంచనున్నారు. దాని వల్ల ఉపయోగం ఏంటంటే.. మాంసం శుద్ధిగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఇక, పట్టణం, నగరం అనే తేడా లేకుండా.. హోటళ్లు, రెస్టారెంట్లకు కూడా ప్రభుత్వం నుంచే సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోనున్నారు.
Read Also… Bandi Sanjay letter to CM: రైతాంగ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఘాటు లేఖ