Bandi Sanjay letter to CM: రైతాంగ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఘాటు లేఖ

రాష్ట్రంలో రైతాంగ సమస్యల పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ పూర్తి విఫలమైందని బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు బండి సంజయ్.

Bandi Sanjay letter to CM: రైతాంగ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఘాటు లేఖ
Bandi Sanjay Letter To Cm Kcr

Bandi Sanjay letter to CM KCR: భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యలపై ప్రత్యేక ఫోకస్ చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. రాష్ట్ర సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా
రాష్ట్రంలో రైతాంగ సమస్యల పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ పూర్తి విఫలమైందని బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు బండి సంజయ్. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రుణమాఫీ కింద ఇవ్వాల్సిన రూ.27,500 కోట్ల నిధులను విడుదల చేయాలన్నారు.

ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించిన బండి సంజయ్.. ప్రతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరి పంట వేయొద్దంటూ ఇచ్చిన ప్రకటనను సీఎం ఉపసంహరించుకోవాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా సొమ్ము రూ.413.50కోట్లు చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి దళారీల నుంచి రైతులను రక్షించాలన్నారు. ధరణిలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని.. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను వెంటనే మంజూరు చేయాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతులకు అండగా ఉండి.. వారి తరఫున బీజేపీ పోరాటం చేస్తుందని లేఖలో వివరించారు బండి సంజయ్.

Bandi Sanjay Letter to CM KCR on Farmers issue

Read Also… Eggless Ragi Cake: కొబ్బరిపాలతో రుచికరమైన రాగి కేక్.. ఇంట్లో ఈజీగా తయారు చేసుకోండి ఇలా

TTD: టీటీడీ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య.. ఈ ఉదయం విడుదల కాని శ్రీవారి దర్శన టికెట్లు

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu