Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eggless Ragi Cake: కొబ్బరిపాలతో రుచికరమైన రాగి కేక్.. ఇంట్లో ఈజీగా తయారు చేసుకోండి ఇలా

Eggless Ragi Cake: రాగులు క్రిందటి తరానికి చెందిన భారతీయులకు ప్రత్యేకించి దక్షిణాది వారికీ సుపరిచితం. ఒకప్పుడు ప్రసిద్ధ చిరు ధాన్యం.. ఈ రాగులు శరీరానికి కావాల్సిన పోషకాలను..

Eggless Ragi Cake: కొబ్బరిపాలతో రుచికరమైన రాగి కేక్.. ఇంట్లో ఈజీగా తయారు చేసుకోండి ఇలా
Ragi Cake
Follow us
Surya Kala

|

Updated on: Sep 24, 2021 | 10:52 AM

Eggless Ragi Cake:రాగులు క్రిందటి తరానికి చెందిన భారతీయులకు ప్రత్యేకించి దక్షిణాది వారికీ సుపరిచితం. ఒకప్పుడు ప్రసిద్ధ చిరు ధాన్యం.. ఈ రాగులు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. అంతేకాదు.. మన వాతావరణానికి ఈ రాగులు మంచి ఆహారం .. ఈ చిరుధాన్యం అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. ఇక రాగి పిండితో రుచికరమైన ఆహారం కూడా తయారు చేసుకోవచ్చు. రాగి పిండి దోశ , రాగి లడ్డూలు, బిస్కెట్లు, పకోడీలు వంటి అనేక రకాల వంటకాలను తయారుచేసుకోవచ్చు.  అంతేకాదు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినడానికి ఆసక్తిని చూపించే రాగి పిండి తో కేక్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈరోజు కొబ్బరి పాలతో రాగికేక్ తయారీ విధానము గురించి తెలుసుకుందాం..

తయారీకి కావాల్సిన పదార్ధాలు: 

రాగి పిండి- ముప్పావు కప్పు గోధుమ పిండి – ముప్పావు కప్పు కొబ్బరి పాలు – ముప్పావు కప్పు బేకింగ్‌ పౌడర్‌ – 1 టీ స్పూను బేకింగ్‌ సోడా – అర టీ స్పూను బెల్లం పొడి – 1 కప్పు పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు కోకోపౌడర్ – 3 టేబుల్‌ స్పూన్లు వెన్న  – 150 మి.లీ. (కరిగించినది) వెనిలా ఎసెన్స్‌ – 1 టేబుల్‌ స్పూను కొబ్బరి పాలు – 1 కప్పు

ఉప్పు – చిటికెడు

పావు కప్పుటాపింగ్‌ కోసం.. పెరుగు

తయారీవిధానం: ముందుగా కేక్‌ ప్యాన్‌కి కొంచెం నెయ్యి రాసి.. దానిని మైక్రో ఒవేన్ లో 170 డిగ్రీల వద్ద ఒక పావు గంట సేపు వేడి చేయాలి.  ఇక ఒక గిన్నె తీసుకుని అందులో రాగి పిండి, గోధుమ పిండి, బేకింగ్‌ పౌడర్, ఉప్పు, కోకో పొడిని వేసుకుని.. వీటిని మిక్స్ చేయాలి. తర్వాత ఈ పౌడర్ ను రెండు సార్లు జల్లించి పక్కన పెట్టుకోవాలి.  ఇలా జల్లించిన మెత్తని మిశ్రమానికి ఒక కప్పు బెల్లం పొడి  ముప్పావు కప్పు కొబ్బరి పాలు వేసి మిక్స్ చేయాలి. తర్వాత అందులో కరిగించిన బటర్, పెరుగు వేసి.. ఉండలు లేకుండా అన్ని బాగా కలిసేలా కలపాలి. ఉండలు లేకుండా ఇలా కలిపిన మిశ్రమాన్ని నెయ్యి రాసి.. వేడి చేసుకున్న ప్యాన్ లో వేసుకుని.. సమానంగా చేసి.. మళ్ళీ అవెన్ లో పెట్టి.. ఒక అరగంట ఉడికించాలి. తర్వాత ఒక పావుగంట చల్లారనిచ్చి ఒవేన్ నుంచి కేక్ ను బయటకు తీయాలి.

ఇప్పుడు  ఒక పాత్రలో కొబ్బరి పాలు, పంచదార, కోకో పొడి వేసి స్టౌ మీద ఉంచి, పంచదార కరిగేంతవరకు బాగా కలుపుకోవాలి. మంట బాగా తగ్గించి, ఈ మిశ్రమాన్ని మరిగించాలి. అనంతరం అందులో వెనిలా ఎసెన్స్‌ వేసి, మిశ్రమం చిక్కబడేవరకు కలపాలి. తర్వాత ఈ టాపింగ్ మిశ్రమాన్ని దింపి చల్లారబెట్టాలి. అప్పుడు ఈ కోకోపౌడర్ మిశ్రమం చిక్కగా, క్రీమీగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని కేక్‌ మీద సమానంగా పోసి, చాకుతో సరిచేసి.. టాపింగ్అం చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రాగి కేక్ రెడీ.

Also Read:  Abutilon Indicum: రోడ్డుసైడ్‌ని పెరిగే కలుపు మొక్కే.. పిచ్చి కుక్క కాటుకు, పురుషుల్లో లైంగిక సమస్యలకు చక్కటి ఔషధం.. తుత్తుర బెండ