Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health News: పులియబెట్టిన ఆహారం అంటే ఏమిటీ..! దీనివల్ల శరీరానికి కలిగే లాభాలు ఏంటి..

Health News: మీరు ఎక్కువగా ఇడ్లీ, దోస వంటి ఆహారాలు తింటారు. అంతేకాదు వాటిని ఆస్వాదించడానికి చాలాసార్లు రెస్టారెంట్‌కు వెళ్తారు. వీటిని పులియబెట్టిన ఆహారాలుగా

Health News: పులియబెట్టిన ఆహారం అంటే ఏమిటీ..! దీనివల్ల శరీరానికి కలిగే లాభాలు ఏంటి..
Fermented Food
Follow us
uppula Raju

|

Updated on: Sep 24, 2021 | 10:21 AM

Health News: మీరు ఎక్కువగా ఇడ్లీ, దోస వంటి ఆహారాలు తింటారు. అంతేకాదు వాటిని ఆస్వాదించడానికి చాలాసార్లు రెస్టారెంట్‌కు వెళ్తారు. వీటిని పులియబెట్టిన ఆహారాలుగా పరిగణిస్తారు. ఇవి పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పులియబెట్టిన ఆహారం గట్‌లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. వాపు లక్షణాలను తగ్గిస్తుంది. అయితే అసలు పులియబెట్టిన ఆహారం అంటే ఏమిటీ.. దాని వల్ల లాభాలు ఏంటో తెలుసుకుందాం. వాస్తవానికి పులియబెట్టిన ఆహారాలు ఈస్ట్ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. ఈస్ట్ పెరిగిన వెంటనే వాటి రుచిలో కొంచెం పులుపు ఉంటుంది. ఇందులో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. వీటిని ప్రోబయోటిక్స్ అంటారు.

పులియబెట్టిన ఆహారం ప్రయోజనాలు..

1. ఉదర ప్రయోజనాలు పొట్టను ఆరోగ్యంగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అన్ని వ్యాధులకు మూలం పొట్ట. పులియబెట్టిన ఆహారంలో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి అన్ని సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. పులియబెట్టిన ఆహారంలో ఉండే లాక్టిక్ యాసిడ్ పేగులకు ఎంతో మంచిది. ఇది పేగుల్లో ఉండే మురికి, చెడు బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది.

2. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి చాలా త్వరగా అనారోగ్యానికి గురవుతాడు. వైరల్, ఫ్లూ మొదలైన అంటువ్యాధులు అతడిని వేగంగా చుట్టుముడుతాయి. అటువంటి పరిస్థితిలో మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచే మంచి బ్యాక్టీరియా అవసరం. అప్పుడు పులియబెట్టిన ఆహారం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

3. జీవక్రియలో మెరుగుదల పులియబెట్టిన ఆహారాలు తేలికగా జీర్ణమవుతాయి. వాటిని తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. బరువును తగ్గించడంలో తోడ్పడుతుంది. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల అవసరాన్ని తీరుస్తుంది. దీని కారణంగా శరీరానికి విటమిన్ బి -12 చాలా లభిస్తుంది.

4. కిణ్వ ప్రక్రియ దక్షిణ భారత ఆహారంలో కిణ్వ ప్రక్రియ ఉంటుంది. అందువల్ల దోశ, ఊతప్పం, ఇడ్లీ, మొదలైనవి తినవచ్చు. వీటిని ఇంట్లో కూడా తయారు చేసుకొని తినవచ్చు. ఇది కాకుండా, రొట్టె, పెరుగు, ఊరగాయ, పెరుగు-బియ్యం మొదలైనవి కూడా పులియబెట్టిన ఆహారం కేటగిరీలోకి వస్తాయి.

Buttermilk: వర్షాకాలం అని మజ్జిగను పక్కన పెడుతున్నారా.. అయితే ఆరోగ్యానికి అమృతం మజ్జిగ.. దీనితో ఎన్ని లాభాలో తెలుసా

Post Pregnancy Diet: ప్రసవానంతరం ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఎందులో పోషకాలు ఎక్కువ.. ఆయుర్వేదంలో ఏముంది..

Health Tips: ఎండిన కొబ్బరి తింటే గుండె సమస్యలు ఫసక్.. బోలెడన్నీ ప్రయోజనాలు మీరు తెలుసుకోండి..