Abutilon Indicum: రోడ్డుసైడ్‌ని పెరిగే కలుపు మొక్కే.. పిచ్చి కుక్క కాటుకు, పురుషుల్లో లైంగిక సమస్యలకు చక్కటి ఔషధం.. తుత్తుర బెండ

Abutilon Indicum Benefits: అతిబాలా సాధారణ రోడ్ సైడ్ పెరిగే కలుపు మొక్క. ఎక్కువగా భారతదేశంలోని వేడి ప్రాంతాల్లో ఎక్కువగా కలుపు మొక్కగా పెరుగుతుంది. ఆకులు గుండె ఆకారంలో..

Abutilon Indicum: రోడ్డుసైడ్‌ని పెరిగే కలుపు మొక్కే.. పిచ్చి కుక్క కాటుకు, పురుషుల్లో లైంగిక సమస్యలకు చక్కటి ఔషధం.. తుత్తుర బెండ
Abutilon Indicum

Abutilon Indicum Health Benefits: అతిబాలా సాధారణ రోడ్ సైడ్ పెరిగే కలుపు మొక్క. ఎక్కువగా భారతదేశంలోని వేడి ప్రాంతాల్లో ఎక్కువగా కలుపు మొక్కగా పెరుగుతుంది. ఆకులు గుండె ఆకారంలో, పసుపు పూల తో ఎత్తుగా ఉంటుంది. మాల్వేసి కుటుంబానికి చెందిన ఔషధ మొక్కను సాంప్రదాయ వైద్య విధానంలో ఉపయోగిస్టార్. ఈ మొక్కలు వేర్లు,  ఆకులు, పువ్వులు, బెరడు, విత్తనాలు , కాండం వంటి వివిధ భాగాలు అన్నీ ఉపయోగించబడతాయి. ఈ మొక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీహైపెర్లిపిడెమిక్, మూత్రవిసర్జన, హెపాటోప్రొటెక్టివ్, హైపోగ్లైసీమిక్, ఇమ్యునోమోడ్యులేటరీ, అనాల్జేసిక్, యాంటీమైక్రోబయల్, మలేరియా నిరోధక గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ అతిబలా ను కొన్ని ప్రాంతాల్లో దువ్వెన బెండ, తుత్తురు బెండ, దువ్వెన కాయలు అని కూడా అంటారు.  ఈరోజు ఈ మొక్క ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలుసుకుందాం..

*తుత్తురు బెండ ఆకులు మృదువుగా జిగటగా ఉంటాయి. శరీరంలోని  మలినాలను బయటకు పంపి శుద్ధి చేస్తుంది.
*ఈ మొక్క 4 లేక 5 ఆకులు నలిపి పావు లీటరు నీటిలో వేసి సగానికి మరిగించి వడపోసి చల్లార్చి ఒక చెంచా కండ చెక్కర కలిపి మూడు పూటలా తాగుతుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. కిడ్నీలో రాళ్లు కరిగి మూత్రం ద్వారా పడిపోతాయి. అంతేకాదు ఇదే కషాయాన్ని కళ్ళు మూసుకుని కండ్లపై పోసి కడుగుతుంటే.. కంటి చూపు మెరుగుపడుతుంది.
*జ్వరంతో బాధపడేవారు అతిబల ( ముద్రబెండ ) ఆకులను నీటిలో నానబెట్టి వడపోసి అందులొ కొద్దిగా కండ చెక్కర కలిపి కొద్ది కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఇదే నీరు మూడుపూటలా తాగితే మూత్రంలో మంట, చురుకు , మూత్రాశయం వాపు , దీర్ఘకాలిక దగ్గు నుంచి ఉపశమనం  లభిస్తుంది.
*ఈ ఆకులను ముద్దగా చేసి పిచ్చికుక్క కరిచిన చోట గట్టిగా కట్టడం వలన విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. పిచ్చికుక్క కరిచిన వెంటనే అతిబల ఆకురసం 70 గ్రా మొతాదుగా తాగించాలి.  ఇలా చేస్తుంటే విషం విరిగిపొతుంది.
*ఈ చెట్టు మొత్తాన్ని కాల్చి బూడిద చేసి రెండు రెట్ల నీళ్లలో నానబెట్టి మూడు రోజుల పాటు అలా ఉంచాలి. రోజు ఒకసారి కర్రతో కలుపుతూ ఉండాలి. మూడవరోజు పైన తేలిన నీటిని మాత్రమే తీసుకొని ఎగిరిపోయే అంతవరకు మరిగించాలి. గిన్నెలో మిగిలిన బూడిదను మెత్తగా నూరి దీనిని రోజు అరచెంచా మోతాదులో తీసుకుంటూ ఉంటే శరీరంలో శ్వాస సంబంధ సమస్యలు తగ్గిపోతాయి
*శీఘ్ర స్ఖలనం సమస్య ఉన్నవారు 100 గ్రాముల ఆకుల పొడి 100 గ్రాముల పట్టిక శతావరి పొడి 100 గ్రాములు మొత్తం మిక్స్ చేసి పాలతో తీసుకోవడం వలన పురుషులలో శీఘ్రస్కలనం సమస్య తగ్గుతుంది
* అతిబల ఆకులను కూరలా వండి రెండు పుతలా తింటూ ఉంటే మొలల నుండి కారే రక్తం ఆగిపొతుంది.
*అతిబల వేరుని నిలువ చేసుకొని రోజు రెండు పూటలా కొంచం నీటితో సానరాయి పైన ఆ వేరుని అరగదీసి ఆ గంధాన్ని వాపుల పైన పట్టిస్తూ ఉంటే రొమ్ముల వాపు తగ్గిపొతుంది.
*అతిబల గింజలను నిప్పుల పైన వేసి ఆ పొగను పిల్లల గుదస్తానముకు తగిలేట్టు వేస్తే దాని ప్రభావమునకు లొపలి నులిపురుగులు నశించిపోతాయి .
*అతిబల వేర్లను దంచి పొడి చేసి జల్లించి నిలువచేసి , ఆ పొడిని మూడు, నాలుగు చిటికెల మొతాదుగా ఆవునేయ్యితో కలిపి రెండు పూటలా ఆహారానికి గంట ముందు సేవిస్తూ ఉంటే గుండెకి బలం కలగడమే కాకుండా ముఖం కాంతి వంతంగా అవుతుంది.

Also Read:

వర్షాకాలం అని మజ్జిగను పక్కన పెడుతున్నారా.. అయితే ఆరోగ్యానికి అమృతం మజ్జిగ.. దీనితో ఎన్ని లాభాలో తెలుసా

 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu