Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buttermilk: వర్షాకాలం అని మజ్జిగను పక్కన పెడుతున్నారా.. అయితే ఆరోగ్యానికి అమృతం మజ్జిగ.. దీనితో ఎన్ని లాభాలో తెలుసా

Buttermilk Benefits: వేసవిలో ఎక్కువ సార్లు మజ్జిగ తాగినా.. వర్షాకాలంలో మాత్రం మజ్జిగను పక్కకు పెడతారు. అయితే మజ్జిగ ఆరోగ్యానికి అమృతం వంటిదని.. ఏ కాలంలోనైనా సరే మజ్జిగను తీసుకోవాలని..

Buttermilk: వర్షాకాలం అని మజ్జిగను పక్కన పెడుతున్నారా.. అయితే ఆరోగ్యానికి అమృతం మజ్జిగ.. దీనితో ఎన్ని లాభాలో తెలుసా
Buttermilk
Follow us
Surya Kala

|

Updated on: Sep 24, 2021 | 8:52 AM

Buttermilk Benefits: వేసవిలో ఎక్కువ సార్లు మజ్జిగ తాగినా.. వర్షాకాలంలో మాత్రం మజ్జిగను పక్కకు పెడతారు. అయితే మజ్జిగ ఆరోగ్యానికి అమృతం వంటిదని.. ఏ కాలంలోనైనా సరే మజ్జిగను తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పెరుగుకు నాలుగురెట్లు నీళ్లు కలిపి చిలికి వెన్న తొలగిస్తే మజ్జిగ తయారవుతుంది. మజ్జిగలో కొవ్వును తొలగిస్తారు కనుక పెద్ద వయసువారికి మంచి చేస్తుంది. పెరుగుకి బరువునీ, కఫాన్నీ పెంచే గుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఆవు మజ్జిగ మూడు దోషాలను తగ్గిస్తుంది. పథ్యంగా, ఆకలిని పెంచేదిగా, రుచికారకంగా, బుద్ధివర్థకంగా పనిచేస్తుంది. గేదె మజ్జిగ కఫాన్ని పెంచుతుంది. అలాగే వాపును పెంచుతుంది. కాబట్టి పరిమితంగా వాడాలి. మేక మజ్జిగ తేలికగా ఉంటుంది. మూడు దోషాల మీద పనిచేస్తుంది. మజ్జిగ ఆరోగ్యానికి అమృతంలాంటిది. మజ్జిగ తీసుకోవడం వలన పలు జబ్బులను దూరం చేస్తుంది. బజార్లో లభించే శీతలపానియాలకన్నా మజ్జిగ లక్షలరెట్లు మంచిది. మజ్జిగతో ఎన్నో లాభాలున్నాయి.

ఆరోగ్యానికి అమృతం మజ్జిగ: 

*మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. *పైల్స్ వ్యాధిలో మజ్జిగ బాగా పనిచేస్తుంది. మజ్జిగ పోసిన చోట గడ్డి మొలవదు. అలాగే మజ్జిగను ఎక్కువగా వాడేవారిలో పైల్స్ కూడా తయారుకావు. *దురదతో కూడిన అర్శమొలలకు వెన్నతో కూడిన మజ్జిగ తీసుకోవాలి. మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి తీసుకుంటే మల విసర్జన తరువాత మల ద్వారంలో వచ్చే మంట తగ్గుతుంది. *ఎక్కుళ్ళు వస్తున్నప్పుడు ఒక చెంచా మజ్జిగలో సొంఠి కలుపుకుని సేవించండి. వెంటనే ఉపశమనం కలుగుతుంది. * వాంతులయ్యేటప్పుడు మజ్జిగతోపాటు జాజికాయపొడిని మజ్జిగలో కలుపుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. * మజ్జిగలో వేంచిన జీలకర్ర కలుపుకుని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. * కాళ్ళ పగుళ్ళకు మజ్జిగ నుంచి తీసిన తాజా వెన్నను పూస్తే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. * ఊబకాయంతో బాధపడేవారు ప్రతి రోజు క్రమం తప్పకుండా మజ్జిగ తీసుకుంటే ఊబకాయ సమస్యనుండి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. మజ్జిగలో విటమిన్ బి12, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం ఉంటాయి. ఊబకాయ నివారణకు ఇవి ఎంతో సహకరిస్తుంది. * వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో పుష్కలంగా ఉంది. * ప్రతి రోజు మజ్జిగ తీసుకోవడం వలన జీర్ణక్రియ సాఫీగా జరిగి తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేందుకు దోహదపడుతుంది. * మజ్జిగ తీసుకోవడం వలన శరీరానికి కావలసిన విలువైన విటమిన్లు, మినరల్స్ అందుతుంది. వివిధ జబ్బులను రానీయకుండా మజ్జిగ శరీరాన్ని కాపాడుతుంటుంది. *మజ్జిగను సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే వాతాన్ని తగ్గిస్తుంది. *మజ్జిగను పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది. *మజ్జిగకు శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది.

మజ్జిగ ఆరోగ్యకరమైన పానీయం. కనుక ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజు మజ్జిగను తీసుకోండి. అయితే మజ్జిగను వాడకూడని సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఉబ్బసం, దగ్గు, బ్రాంకైటిస్, నిమోనియా వంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న సమయంలో మజ్జిగను వాడటం మంచిది కాదు.

Also Read: రాజు ఎవరినీ నమ్మకూడదు.. హద్దులు దాటి చనువుగా ఉండకూడదంటూ.. భీష్ముడు చెప్పిన చిలుక కథ