Telangana Floods: ఏడుపాయల వన దుర్గా మాత ఆలయానికి వరద పోటు, ఉప్పొంగిన మంజీరా నది

మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గా మాత ఆలయానికి ఈ ఉదయం వరద పోటెత్తింది. ఆలయం ముందు నీటి ఉధృతి కొనసాగుతోంది

Telangana Floods: ఏడుపాయల వన దుర్గా మాత ఆలయానికి వరద పోటు, ఉప్పొంగిన మంజీరా నది
Edupayala Floods
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 24, 2021 | 9:47 AM

Edupayalu Vana Durga Bhavani temple: మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గా మాత ఆలయానికి ఈ ఉదయం వరద పోటెత్తింది. ఆలయం ముందు నీటి ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఏడుపాయల ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఆలయ రాజగోపురం వద్ద ఉత్సవ విగ్రహానికి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు. సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో మంజీరా నది ప్రవాహం విపరీతంగా పెరిగి ఈ పరిస్థితికి కారణమైంది.

ఇలా ఉండగా, అటు, ఆదిలాబాద్‌ భారీవర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇచ్చోడ మండలంలో నారాయణపూర్‌ దగ్గర వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వాగు దాటు క్రమంలో ఓ వృద్దుడు కొట్టుకుపోయాడు. అయితే అదృష్టవశాత్తూ పక్కనే ఉన్నవారు వెంటనే అలర్ట్‌ అయి కాపాడారు.

ఇటు కొమరం భీమ్‌ జిల్లా చింతలమానపల్లి మండలం దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు నాలుగురోజులుగా దీక్ష చేపట్టారు. వాగు దగ్గర బ్రిడ్జి సాధన దీక్షను కొనసాగిస్తున్నారు. వాగులో వరద వచ్చినపుడు రాకపోకలకు ఇబ్బందులు ఎదురుతున్నాయని అంటున్నారు.

Read also: Kidnap: హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లో కలకలం.. ఇద్దరు మహిళల్ని కిడ్నాప్ చేసిన దుండగులు