చాణక్య నీతి: మీ చుట్టూ ఉండే వారు ఎలాంటి వారో తెలుసుకోవాలా?.. ఈ 4 విషయాలను పాటించండి..

Chanakya Niti : అనుభవానికి మించిన గురువు లేరని అంటుంటారు. ఎందుకంటే.. అనుభవం ఏది సరైంది, ఏది సరికాదు అనే విషయాన్ని నేర్పుతుంది.

చాణక్య నీతి: మీ చుట్టూ ఉండే వారు ఎలాంటి వారో తెలుసుకోవాలా?.. ఈ 4 విషయాలను పాటించండి..
Chanakya Neethi
Follow us

|

Updated on: Sep 24, 2021 | 10:08 AM

Chanakya Niti : అనుభవానికి మించిన గురువు లేరని అంటుంటారు. ఎందుకంటే.. అనుభవం ఏది సరైంది, ఏది సరికాదు అనే విషయాన్ని నేర్పుతుంది. ప్రస్తుత సమాజంలో చాలామంది మోసపూరిత, కుట్రపూరితమైన ప్రజలే ఎక్కువగా ఉన్నారు. అలాంటి సమయంలో అనుభవమే ఎవరు ఎలాంటి వారు అనేది గుర్తించానికి సహాయపడుతుంది. అయితే, అందరికీ అనుభవం ఉండాలని రూల్ ఏం లేదు. మరి మన చుట్టూ ఉన్న ప్రజలు ఎవరు ఎలాంటి వారు అనేది ఎలా తెలుసుకోవాలి? దానికి ఆచార్య చాణక్య అద్భుతమై నాలుగు విషయాలను చెప్పారు. వాటి ఆధారంగా మన చుట్టూ ఉన్న మనుషుల వ్యక్తిత్వాలను పసిగట్టవచ్చంటున్నారు. మరి ఆ నాలుగు విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పరిత్యాగ భావన.. ఒక వ్యక్తి తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు. మరికొందరు ఇతరుల పట్ల త్యాగ భావన కలిగి ఉంటాడు. కాబట్టి.. వ్యక్తిలో పరిత్యాగ భావనను తప్పకుండా చూడాలి. త్యాగనిరతి వ్యక్తిలోని మానవత్వాన్ని తెలుపుతుంది. ఇతరులకు సంతోషాన్ని పంచేందుకు.. తాను ఎంతటి బాధను భరించడానికి అయినా సిద్ధంగా ఉంటే అలాంటి వ్యక్తిని మీరు ఖచ్చితంగా నమ్మొచ్చు.

స్వభావాన్ని గమనించండి.. ఏ వ్యక్తి వ్యక్తిత్వంలోనైనా అతని పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ కారణంగా.. ఎవరైనా వ్యక్తిని పరీక్షించేటప్పుడు ఖచ్చితంగా అతని స్వభావాన్ని గమనించాలి. మంచి స్వభావం ఉన్న వ్యక్తి.. పరిస్థితులను అర్థం చేసుకుంటారు. అలాంటి వారిని కూడా నమ్మొచ్చు.

లక్షణాలను పరిశీలించండి.. కోపం, స్వార్థం, అబద్ధం, అహంకారం, సోమరితనం వంటి లక్షణాలు ఉన్న వ్యక్తి విశ్వసించడానికి ఏమాత్రం అర్హులు కాదు. అందుకే ఇతరుల్లో ఈ పాయింట్లను మీరు ఖచ్చితంగా పరీక్షించాలి. ప్రశాంతంగా, మర్యాదగా, నిజాయితీగా ఉండే వ్యక్తులను విశ్వసించాలి.

ధర్మాధర్మ విధానాలు.. ధర్మం, అధర్మ మార్గాన్ని అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి ఏమైనా చేస్తాడు. అందుకే ఒక వ్యక్తిని పరీక్షించేటప్పుడు, అతను అనుసరించే విధానాలను గమనించారు. ధర్మ మార్గంలో వెళ్తున్నారా? అధర్మ మార్గంలో పయనిస్తున్నారా? అనేది చూడాలి. అధర్మ మార్గాన్ని అనుసరించే వారు ఎప్పుడైనా, ఎవరినైనా మోసం చేస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండటం ఉత్తమం.

Also read:

India Corona Updates: దేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు.. తాజా లెక్కలు ఇవే..

Hair Cut: జట్టు కత్తిరించినందుకు హెయిర్‌ సెలూన్‌కు రూ. 2 కోట్ల జరిమానా.. అసలు మ్యాటర్ ఏంటంటే..

Viral Video: 90 ఏళ్ల బామ్మ.. కారును ఓ రేంజ్‌లో నడుపుతోంది.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..