Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Cut: జట్టు కత్తిరించినందుకు హెయిర్‌ సెలూన్‌కు రూ. 2 కోట్ల జరిమానా.. అసలు మ్యాటర్ ఏంటంటే..

Wrong Hair Cut: జట్టును చెప్పినట్లు కాకుండా.. తప్పుగా కట్ చేసినందుకు ఓ హెయిర్ సెలూన్‌ యాజమాన్యం రూ. 2 కోట్ల నష్టపరిహారం చెల్లించుకోవాల్సి వస్తోంది.

Hair Cut: జట్టు కత్తిరించినందుకు హెయిర్‌ సెలూన్‌కు రూ. 2 కోట్ల జరిమానా.. అసలు మ్యాటర్ ఏంటంటే..
Hair Cutting
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 24, 2021 | 9:36 AM

Wrong Hair Cut: జట్టును చెప్పినట్లు కాకుండా.. తప్పుగా కట్ చేసినందుకు ఓ హెయిర్ సెలూన్‌ యాజమాన్యం రూ. 2 కోట్ల నష్టపరిహారం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హెయిర్ ప్రోడక్ట్ మోడల్ ఆష్నా రాయ్. ఆమెకున్న అందమైన జుట్టుతోనే పెద్ద పెద్ద ‘హెయిర్ కేర్ బ్రాండ్’ లకు మోడలింగ్ చేస్తోంది. అయితే తాజాగా ఆమె ఢిల్లీలోని ఓ సెలూన్‌కు వెళ్లింది. హెయిర్ కటింగ్ చేయాల్సిందిగా కోరింది. అక్కడ ఆమె సూచనలు విరుద్ధంగా సెలూన్ సిబ్బంది హెయిర్ కట్ చేశారు. ‘ఫిక్స్’ స్టైల్, నాలుగు అంగుళాల మేరకు జుట్టు మాత్రమే కత్తిరించాలని పేర్కొంది. కానీ, వారు ఆమె మాట సరిగా వినలేదు. కేవలం 4 నాలుగు అంగుళాల జుట్టును మాత్రమే మిగిల్చి పొడవాటి జుట్టునంతా కత్తిరించేశారు. అది చూసి ఆమె షాక్ అయ్యింది. వెంటనే సెలూన్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేయగా.. వారు ఉచితంగా హెయిర్‌ ట్రీట్మెంట్ చేశారు. అయితే, ఆ ట్రీట్మెంట్ కారణంగా ఆమె జుట్టు శాశ్వతంగా దెబ్బ తింటుందని ఆశ్నా ఆందోళన వ్యక్తం చేసింది. ఇక పోతే.. హెయిర్ బేస్‌డ్ మోడల్ అయిన ఆమెకు జుట్టు లేకపోవడంతో ఆమెకు వచ్చే ఆఫర్లు సైతం కోల్పోవాల్సి వచ్చింది. ‘హెయిర్ ప్రోడక్ట్’ మోడల్ అయిన ఆమెకు జుట్టే ఆధారం. ఆ హెయిర్‌ ఆధారంగానే అనేక బ్రాండ్‌లకు మోడల్‌గా నటిస్తూ వస్తోంది. ఇప్పుడు హెయిర్ కట్ చేయడంతో.. ఆఫర్లన్నీ పోయాయి. దాంతో ఆమె తీవ్ర వేదనకు గురైంది. జీవన శైలి మొత్తం మారిపోయింది. టాప్ మోడల్ కావాలనే ఆమె కల చెదిరిపోయింది.

జుట్టు కత్తిరించడంలో సెలూన్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆమె తీవ్రమైన మానసిక వేధనకు, ఒత్తిడికి గురైంది. ఆశ్నా తన పనిపై దృష్టి పెట్టలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమె కన్స్యూమర్స్ కోర్టును ఆశ్రయించింది. సదరు హెయిర్ సెలూన్‌పై ఫిర్యాదు చేసింది. తనకు రూ. 3 కోట్ల నష్ట పరిహారం ఇప్పించాలని కోరింది. ఆష్నా రాయ్ ఫిర్యాదును పరిశీలించిన కన్స్యూమర్స్ కోర్టు.. సెలూన్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఆష్నా జుట్టు నష్టపోయిందని నిర్ధారణకు వచ్చింది. బాధితురాలికి రూ. 2 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని సెలూన్‌ను ఆదేశించింది. అది కూడా 8 వారాలలోగా ఆ మొత్తం సొమ్మును బాధితురాలికి అందజేయాలని ఆదేశించింది.

Also read:

Viral Video: 90 ఏళ్ల బామ్మ.. కారును ఓ రేంజ్‌లో నడుపుతోంది.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..

Funny Moments in Assembly: అసెంబ్లీలో ప్రసంగిస్తుండగా జారిపోయిన మాజీ సీఎం పంచె.. సభలో నవ్వులే నవ్వులు..

Hidden Treasure: మణుగూరులో గుప్తనిధుల కలకలం.. దేవత విగ్రహానికి రక్తాభిషేకం.. గుడి ముందే చూస్తే..

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌