Funny Moments in Assembly: అసెంబ్లీలో ప్రసంగిస్తుండగా జారిపోయిన మాజీ సీఎం పంచె.. సభలో నవ్వులే నవ్వులు..

Siddaramaiah Dhoti Falls: అప్పటి వరకూ అసెంబ్లీలో చాలా వాడీ వేడిగా చర్చలు జరుగుతున్నాయి. సభ అంతా గంభీరంగా ఉంది.

Funny Moments in Assembly: అసెంబ్లీలో ప్రసంగిస్తుండగా జారిపోయిన మాజీ సీఎం పంచె.. సభలో నవ్వులే నవ్వులు..
Siddaramaiah
Follow us

|

Updated on: Sep 24, 2021 | 8:44 AM

Siddaramaiah Dhoti Falls: అప్పటి వరకూ అసెంబ్లీలో చాలా వాడీ వేడిగా చర్చలు జరుగుతున్నాయి. సభ అంతా గంభీరంగా ఉంది. అధికార, ప్రతిపక్ష సభ్యల చర్చోపచర్చలతో సభలో ఒక రకమైన సీరియస్ వాతావరణం నెలకొంది. కానీ, అంతలోనే చోటు చేసుకున్న ఓ సన్నివేశంతో సభ అంతా నవ్వులు పూశాయి. స్పీకర్ సహా.. సభ్యులందరూ నవ్వుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సభ్యులైన సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రసగిస్తున్న సమయంలో ఆయన పంచె జారిపోయింది. కొంచెం కొంచెం జారిపోతున్న పంచెను ఇతర సభ్యులు గమనించారు. కాంగ్రెస్ పార్టీ నేత డీకే శివకుమార్.. సిద్ధరామయ్యను సమీపించి పంచె జారిపోతున్న విషయాన్ని తెలిపారు. దాంతో సిద్ధరామయ్య తన పంచెను సరి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. సిద్ధరామయ్య సీరియస్‌గా ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో ఆయన కట్టుకున్న పంచె మెల్లగా జారుతోంది. అది గమనించిన డీకే శివకుమార్.. సిద్ధరామయ్య వద్దకు వచ్చి చెవిలో జారుతున్న పంచె గురించి చెప్పారు. దానికి రియాక్ట్ అయిన సిద్ధరామయ్య…‘ఓహ్.. అవునా?’’ అంటూ మైక్‌లోనే అన్నారు. వెంటనే అలర్ట్ అయిన సిద్ధరామయ్య.. పంచెను సరిచేసుకున్న తరువాత తన ప్రసంగాన్ని కొనసాగిస్తానని చెప్పారు. ఇది విన్న సభ్యులు అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇంతలో కల్పించుకున్న స్పీకర్.. ‘‘సమస్య ఏంటో మీరే చెప్పండి’’ అంటూ చమత్కరించారు.

దీనికి రియాక్ట్ అయిన సిద్ధరామయ్య.. కరోనా బారి నుంచి కోలుకున్న తరువాత బరువు తగ్గానని, పంచె వదులు అయ్యిందంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ఆ కారణంగా పదే పదే పంచె జారిపోతోందని అన్నారు. ఈ వ్యవహారంపై రెస్పాండ్ అయిన మంత్రి ఈశ్వరప్ప.. పాలకవర్గం నుంచి ఎవరో ఒకరు వెళ్లి సాయం సిద్ధరామయ్యకు సాయం చేయండి అంటూ కామెంట్ చేశారు. దీనికి కూడా సిద్ధరామయ్య స్పందించారు. ‘మీరు అటువైపున(అధికారపక్షం) ఉన్నందున నేను మిమ్నల్ని సహాయం కోరను’’ అని ఈశ్వరప్పకు కౌంటర్ ఇచ్చారు.

ఇక ఈ ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘పార్టీ ఇమేజ్‌ను కాపాడే ఉద్దేశ్యంతో మా అధ్యక్షుడు డీకే శివకుమార్ జారుతున్న పంచె గురించి సిద్ధరామయ్య చెవిలో చెప్పారు. కానీ, సిద్ధరామయ్య దానిని సభ మొత్తానికి తెలియజేశారు. ఇక తమ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధం అవ్వండి.’’ అంటూ ఎద్దేవా చేశారు.

ఏది ఏమైనా.. ఈ ఫన్నీ ఘటన కర్ణాటక అసెంబ్లీలో కాసేపు నవ్వులు పూయించింది. సభ్యులందరూ తమ తమ స్టైల్లో చమత్కరిస్తూ సభలో ఉల్లాసాన్ని నింపారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Video:

Also read:

NEET Scam: యావత్ దేశాన్నీ షేక్ చేస్తోన్న నీట్ ఎగ్జామ్ స్కాం.. కశ్మీర్ టు కన్యాకుమారి టాక్ ఆఫ్ ద టౌన్.!

Jangoan Murder: జనగామ జిల్లాలో దారుణం.. భర్తను ఇనుప‌క‌డ్డీతో కొట్టి చంపిన భార్య

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ ఎత్తుకున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..