Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hidden Treasure: మణుగూరులో గుప్తనిధుల కలకలం.. దేవత విగ్రహానికి రక్తాభిషేకం.. గుడి ముందే చూస్తే..

Hidden Treasure: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. గుప్తు నిధుల కోసం గ్రామ దేవతకు రక్తతర్పణం చేశారు దుండగులు.

Hidden Treasure: మణుగూరులో గుప్తనిధుల కలకలం.. దేవత విగ్రహానికి రక్తాభిషేకం.. గుడి ముందే చూస్తే..
Hidden Treasures
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 24, 2021 | 8:04 AM

Hidden Treasure: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. గుప్తు నిధుల కోసం గ్రామ దేవతకు రక్తతర్పణం చేశారు దుండగులు. అది చూసి స్థానిక ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం మల్లంపాడు చెరువు పక్కన ముత్యాలమ్మ ఆలయం ఉంది. ఆ ఆలయంలో గుప్త నిధులు ఉన్నాయని భావించిన కొందరు దుండగులు.. పూజాక్రతువులు నిర్వహించారు. ఇందులో బాగంగా ముత్యాలమ్మ విగ్రహానికి రక్తాభిషేకం చేశారు. అక్కడే పూజాసామాగ్రి, కోడిని వదిలిపెట్టారు.

గుప్త నిధుల కోసం దేవతా విగ్రహం ముందు భారీ గొయ్యి తీశారు. తెల్లవారుజామున ఆలయ పరిసరాల్లోకి వచ్చిన స్థానికులు.. అక్కడ జరిగినదానిని పరిశీలించారు. భయపడిపోయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అక్కడి పరిసరాలను పరిశీలించారు. కాకతీయుల కాలం నాడు నిర్మించిన పురాతన ఆలయం కావడంతో తవ్వకాలు జరిపినట్లు పోలీసులు, స్థానికులు అనుమానించారు. ఆలయంలో ఆరు అడుగుల లోతులో తవ్వకాలు జరిపారు గుప్త నిధుల ముఠా. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Also read:

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. అస్త్రశస్త్రాలు సిద్ధం చేసిన అధికార, విపక్షాలు

Bigg Boss 5 Telugu: పదవతరగతిలోనే అతడితో ఇల్లువదిలి పారిపోయా.. ఎమోషనల్ అయిన సిరి..

Hyderabad Crime News: హైదరాబాద్‌లో దారుణం.. బ్లాంకెట్‌లో నగ్నంగా మహిళ మృతదేహం.. చెరువులో పడేసేందుకు యత్నం..