Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. అస్త్రశస్త్రాలు సిద్ధం చేసిన అధికార, విపక్షాలు

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం అయింది.. తాము తీసుకొచ్చి పథకాలు, అభివృద్ధిపై సభలో చర్చకు సిద్ధం అయితే, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు కత్తులు నూరుతున్నాయి.

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. అస్త్రశస్త్రాలు సిద్ధం చేసిన అధికార, విపక్షాలు
Telangana Assembly
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 24, 2021 | 8:01 AM

Telangana Assembly: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం అయింది.. తాము తీసుకొచ్చి పథకాలు, అభివృద్ధిపై సభలో చర్చకు సిద్ధం అయితే, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు కత్తులు నూరుతున్నాయి. ఈ సమావేశాల్లోనే దళిత బంధు పథకంపై సర్కార్ ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దళిత బంధు, ఆర్ధిక పరిస్థితి, ఇరిగేషన్,విద్య , వైద్యం పై ప్రత్యేక చర్చ జరుపనున్నారు. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలుపనుంది శాసనసభ.మరోవైపు ప్రభుత్వ భూములు అమ్మకంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై సభ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి.

శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది…శుక్రవారం ఉదయం11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి..ఈ సమావేశాల్లో ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకంపై సుదీర్ఘ చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకంపై ప్రత్యేక చర్చకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుమతి కోరనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ పనితీరుపై వివరించేందుకు అధికార పార్టీ సిద్ధం అవుతుంటే… ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు ప్రతీ పక్షాలు సిద్ధం అవుతున్నాయి. 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచిన అంశాలనుతో పాటు పొందుపరచని హామీలపై మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది. రైతు బంధు, రైతు భీమా, ఆసరా పెన్షన్లు , రైతు రుణమాఫీ, దళిత బంధు, ప్రాజెక్టులు , ఇరిగేషన్ పై ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడనుంది. గడిచిన రెండేళ్ల వ్యవధిలో కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ఏ విధమైన ప్రభావం చూపింది. ఏయే రంగాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దాన్ని ప్రభుత్వం ఎలా అధిగమించిందన్న విషయాల పై శాసనసభలో చర్చ జరగనుంది. ఇటు ప్రతి పక్ష పార్టీలు సైతం తమదైన శైలిలో ప్రభుత్వాన్ని సభ వేదికగా ప్రశ్నించనున్నాయి. దానితో పాటు యాసంగిలో వరి సాగు, ధాన్యం కొనుగోలు అంశం కూడా చర్చకు రానుంది. ఇక, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జాలవివాదం, ఉద్యోగాల నియామకం, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపు సహా ఇతర అంశాలు ఈ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 8 కీలక బిల్లులను ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది..

ఇక ప్రభుత్వం తన ప్లాన్ తాను ఉంటే ప్రభుత్వపరంగా, రాజకీయాలపరంగా కూడా విపక్షాలను ఎదుర్కోడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా సిద్ధం అవుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీకీ పిసిసి కొత్త అధ్యక్షుడు వచ్చాక పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ కనపడుతుంది. రేవంత్ ఆధ్వర్యంలో అధికార పార్టీని అనేక రకాల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా సమయంలో సమావేశాలు జరుగుతుండటంతో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని భావిస్తుంది కాంగ్రెస్. ముఖ్యంగా నిరుద్యోగం , దళిత బంధు , నది జలాలు , డ్రగ్స్ , పంట కొనుగోళ్లు , శాంతి భద్రతలు , ధరణి లాంటి అంశాలను అసెంబ్లీ లో లేననెత్తలాని కాంగ్రెస్ భావిస్తుంది. వీటితోపాటు ప్రభుత్వ భూముల అమ్మకాలపై కాంగ్రెస్ ప్రభుత్వన్నీ నిలదీయనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిన వైట్ ఛాలెంజ్ అంశాన్ని ప్రస్తావించేందుకు కాంగ్రెస్ పార్టీ ఫ్లాన్ చేస్తోంది. దానితో పాటు ధాన్యం కొనుగోలు, పొడుభూముల సమస్య పట్ల విపక్షాలు ప్రభుత్వంతో చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది.అటు విపక్షాలు కూడా ఇదే వ్యూహంలో ఉన్నట్టు తెలుస్తుంది…

హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ మరింత దూకుడు పెంచింది. వరుసగా కీలక నేతలు అందరూ పాదయాత్రలు చేస్తూ ప్రభుత్వాన్ని ప్రజా క్షేత్రంలో నిలదిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాత్ర, బండి సంజయ్ పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలకు ఏఏ అంశాలను సభలో లేవనెత్తాలి అనే అంశాలపై దిశ నిర్దేశం చేశారు. ఇప్పటికే గ్రేటర్ లో డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణం , కేజీ టు పీజీ ఉచిత విద్యతో పాటు రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అధోగతి పాలు చేసిందని విమర్శలు చేస్తోంది. ఇదిలా ఉంటే… అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రెండేళ్ల కరోనా సందర్భంగా కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధులుపై మంత్రులు ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటి వరకు కేంద్రం నుండి రాష్ట్రానికి అందిన ఆర్థిక సహాయం పై సభలో మాట్లాడనున్నారు. బాయిల్డ్ రైస్ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంపై సభలో టీఆరెస్ లెవనెత్తితే దీనికి బీజేపీ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇవ్వనున్నారు.

ఆరు నెలల తరువాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా దళిత బంద్ పై చర్చించి ఆ పథకం అమలు తీరుతెన్నులను మరోసారి వివరించే అవకాశం ఉంది. ఆ వివరాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లనుంది అధికార పక్షం. ఈ సందర్భంగా 7 బిల్లులపై చర్చ జరిపి సభలో ఆమోదించనున్నారు. అయితే సభలు సజావుగా సాగేందుకు అదేవిధంగా సమావేశాల్లో తీసుకోవాల్సిన అంశాలపై ఉభయ సభల వాయిదా అనంతరం స్పీకర్ బీఎసి సమావేశం నిర్వహించనున్నారు. ఇదే సమావేశంలో ఎన్ని రోజులు సభలు నిర్బహించాలని అనేది కూడా క్లారిటీ ఇవ్వనున్నారు..

Read Also…  Hyderabad Crime News: హైదరాబాద్‌లో దారుణం.. బ్లాంకెట్‌లో నగ్నంగా మహిళ మృతదేహం.. చెరువులో పడేసేందుకు యత్నం..