Battle of Haifa: మెషిన్‌గన్‌‌లు కూడా అడ్డుకోలేని భారతీయ అశ్వదళపుదాడి.. ఆనాటి మన యుద్ధనైపుణ్యం గుర్తు ‘హైఫా యుద్ధం’..ఇజ్రాయిల్‌లో పాఠ్యంశం

Battle of Haifa: మన చరిత్ర చెప్పని భారతీయ సైనికుల ధైర్య సాహసాలు, యుద్ధ  నీతి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ధీరత్వం.. విదేశీయుల పాఠ్యంశాల్లో పొందుపరిచారు. అక్కడవారు పిల్లలకు..

Battle of Haifa: మెషిన్‌గన్‌‌లు కూడా అడ్డుకోలేని భారతీయ అశ్వదళపుదాడి.. ఆనాటి మన యుద్ధనైపుణ్యం గుర్తు 'హైఫా యుద్ధం'..ఇజ్రాయిల్‌లో పాఠ్యంశం
Haifa Day
Follow us
Surya Kala

|

Updated on: Sep 24, 2021 | 7:44 AM

Battle of Haifa: మన చరిత్ర చెప్పని భారతీయ సైనికుల ధైర్య సాహసాలు, యుద్ధ  నీతి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ధీరత్వం.. విదేశీయుల పాఠ్యంశాల్లో పొందుపరిచారు. అక్కడవారు పిల్లలకు మన సైనికులగురించి బలిదానాల గురించి పాఠాలుగా చెబుతున్నారు. యురేపియన్ దేశాల్లోనే కాదు..అనేక ఇతర దేశాల్లో మన రాజుల, సైనికుల ధైర్య సాహసాల గురించి భావితరాలకు అందిస్తున్నారు. ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైన యుధ్దాల్లో ఒకటిగా నిలిచినా హైఫా యుద్ధాన్ని ఇప్పటికీ ఇజ్రాయిల్ గుర్తు చేసుకుంటుంది.   1918 లో సెప్టెంబర్‌ 22,23న జరిగిన హైఫా యుద్ధాన్ని సంస్మరణ దినోత్సవంగా ఇప్పటికీ జరుపుకుంటుంది. ఇజ్రాయిల్‌ను అప్పట్లో పాలస్తీనాగా పిలిచేవారు. స్వతంత్ర ఇజ్రాయిల్‌ ఏర్పాటుకు ఈ యుద్ధమే పునాది వేసింది. జోధ్‌పూర్‌ మహారాజా, మైసూర్‌ మహారాజా పంపిన అనేకమంది భారతీయ సైనికులు మొదటి ప్రపంచయుద్ధంలో ఇజ్రాయిల్‌ లో ప్రాణత్యాగం చేశారు. టర్కులు, జర్మన్లు, ఆస్ట్రియన్లతో కూడిన సంయుక్త సేనను ఓడించి ఇజ్రాయిల్‌ రేవు పట్టణం హైఫాను సెప్టెంబర్‌, 1918లో విముక్తం చేశారు. 1516 నుండి 402 ఏళ్ళపాటు ఇది టర్కీ ఒట్టమాన్‌ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. 1918లో పాలస్తీనా మీదుగా భారత్‌కు చెందిన రెండు దళాలు ఒట్టోమాన్‌ దళాలతో పోరాడాయి.

ఈ యుద్ధం తరువాత బ్రిటిష్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సేనలతో కలిసి పోరాడిన భారతీయ సైనికులు మొత్తం ఇజ్రాయిల్‌ను విముక్తం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఇజ్రాయిల్‌లో జరిగిన వివిధ పోరాటాల్లో 900 పైగా భారతీయ సైనికులు వీరమరణం పొందారు. ఇప్పటికీ వారి సమాధులను ఇజ్రాయిల్‌ ప్రభుత్వం పరిరక్షిస్తోంది. ప్రతి సంవత్సరం 23 సెప్టెంబర్‌ను భారతీయ సైనికుల స్మృతి దినంగా పాటిస్తారు. వారి బలిదానాల గురించి పాఠశాలల్లో పిల్లలకు చెపుతారు. పాఠ్య పుస్తకాల్లో కూడా వారి విజయగాథలు చేర్చారు. భారత సేనలకు నాయకత్వం వహించిన మేజర్‌ దలపత్‌సింగ్‌ షెకావత్‌ను ‘హైఫా హీరో’గా గుర్తిస్తారు. ఆ యుద్ధంలో ఆయన చనిపోయినప్పటికీ సైనికులు మాత్రం వెనకడుగువేయకుండా భారత్‌కు చిరస్మరణీయమైన కీర్తిని తెచ్చిపెట్టారు.

భారత సైనికుల వీరత్వంతో ఇజ్రాయెల్ కి ఉన్న సంబంధం తెలియాలంటే.. మొదటి ప్రపంచ యుద్ధ కాలానికి వెళ్ళాలి.

మొదటి ప్రపంచ యుద్ధం తారాస్థాయి లో ఉన్న నేపధ్యంలో రెండు కూటములూ వ్యూహాత్మక ఓడరేవులు, స్థావరాలను తమ వశం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న కాలం. ఎందుకంటే కొన్ని కీలక ప్రాంతాల మీద పట్టు, మొత్తం యుద్ధ ఫలితాలనే ప్రభావితం చేస్తాయి. అలాంటి నగరాల్లో ఇజ్రాయెల్ లో ఉన్న హైఫా నగరం ఒకటి. ఈ నగరానికి ఉన్న రైలు మార్గం ,  నౌకాశ్రయం వల్ల కీలకమైన వస్తు సరఫరాకి ఇది అనువైన స్థావరం. అందుకే గ్రేట్ బ్రిటన్ , మిత్రరాజ్యాల దళాలు హైఫాను స్వాధీనం చేసుకోవాలని అనుకున్నాయి. అయితే హైఫా నగరం 1918 లో జర్మన్-టర్కిష్ దళాల ఆధీనంలో ఉంది.  టర్కిష్ సైన్యం మెషిన్ గన్లు , ఫిరంగిలతో శత్రుదుర్భేద్యంగా ఉంది, మరోవైపు, భారత దళాలు వారి వద్ద బల్లేలు మాత్రమే ఉన్నాయి. సంఖ్య పరంగా చూసినా 1500 మంది టర్కీ సైనికులకు వ్యతిరేకంగా 400 మంది మాత్రమే భారతీయ సైనికులు యుద్ధభూమిలో ఉన్నారు. ఆయుధ సంపత్తి ,సైనిక సంపదల మధ్య భారీ తేడా ఉన్నప్పటికీ, టర్కీ సైన్యం నుండి హైఫాను స్వాధీనం చేసుకోవడంలో భారత దళాలు విజయవంతమయ్యాయి.

హైఫాను బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క 15 వ అశ్వికదళ బ్రిగేడ్ చేజిక్కించుకుంది; ఇందులో హైదరాబాద్, మైసూర్, పాటియాలా, అల్వార్, జోధ్పూర్ రాష్ట్రాల నుండి ఇంపీరియల్ సర్వీస్ ట్రూప్స్ ఉన్నారు. దీనిని మొదట ఇంపీరియల్ సర్వీస్ అశ్వికదళ బ్రిగేడ్ అని పిలిచేవారు.హైఫా నగరం కోసం జరిగిన యుద్ధంలో భారతీయ సైనికులు, బ్రిటిష్ సామ్రాజ్యం తరపున పోరాడినప్పటికీ.. ఇజ్రాయెల్ ప్రజలు, భారత సైనికుల సహకారాన్ని, పోరాట పటిమను ప్రత్యేకంగా గమనించారు. హైఫా యుద్ధానికి సంబంధించిన అధికారిక చరిత్ర మాటల్లోనే చెప్పాలంటే “ఆ వ్యూహాత్మక నగరాలను స్వాధీనపరుచుకొనే ప్రయత్నం మొత్తంలో, హైఫా నగర ముట్టడికన్నా గొప్ప అశ్వికదళ చర్య ఏదీ జరగలేదు… బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న మెషిన్ గన్లు కూడా సమరోత్సాహంతో దూకుతున్న ఆ గుర్రాలను ఆపడంలో విఫలమయ్యాయి. కానీ వారిలో చాలామంది గాయాలతో మరణించారు.” ఆ రోజు ఇజ్రాయెల్ కోసం పోరాడిన 900 మంది భారతీయ సైనికులను ఇజ్రాయెల్లోనే ఖననం చేశారు. కెప్టెన్ అమర్ సింగ్ బహదూర్, దఫదర్ జోర్ సింగ్, మేజర్ దల్పత్ సింగ్, కెప్టెన్ అనోప్ సింగ్ మరియు 2 వ లెఫ్టినెంట్ సాగత్ సింగ్ వారిలో ఉన్నారు. ఇప్పుడు హైఫా నగరం లో, 3 నుండి 5 తరగతుల పాఠశాల సిలబస్‌లో జర్మన్-టర్కిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన భారత సైనికుల చరిత్ర ఒక అధ్యాయం. 23 సెప్టెంబర్ ని భారత సైన్యం ‘హైఫా డే’ గా కొనసాగిస్తుంది. అంతేకాదు ఇజ్రాయెల్ ప్రభుత్వం భారత సైనికుల వీరత్వానికి జ్ఞాపికగా 1918లో స్టాంప్ ని విడుదల చేసింది.

జర్మన్సే, టర్కిష్ సైనికుల దగ్గర తుపాకులు, ఫిరంగులు మొదలైన ఆధునిక ఆయుధాలు ఉంటె.. మన సైనికులు ప్రధానంగా అశ్వికులు. కొద్దిమంది సాధారణ కాలిబంటులు. వారి దగ్గర కత్తులు, బల్లాలు తప్ప ఆధునిక ఆయుధాలు లేవు. ఇలా కత్తులు, బల్లాలతో కొద్దిమంది సైనికులు ఆధునిక ఆయుధాలు కలిగిన అపారమైన సైన్యాన్ని ఓడించడం ప్రపంచ చరిత్రలో మరెక్కడా కనిపించదు. అలాగే ఇలాంటి యుద్ధం జరగడం కూడా ఇదే ఆఖరుసారి. కనుక ఇలాంటి అపూర్వమైన యుద్ధం ప్రతి భారతీయుడికి ఎంతో స్ఫూర్తిని, ప్రేరణను కలిగిస్తు చరిత్రలో నిలిచిపోయింది.

Also Read: Gold-Silver Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. స్థిరంగా కొనసాగుతున్న వెండి..