Gold-Silver Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. స్థిరంగా కొనసాగుతున్న వెండి..

Gold-Silver Price Today: పూర్వకాలం నుంచి భారత దేశంలోని ప్రజలు బంగారాన్ని ఒక ఆస్తిగా భావిస్తారు. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో బంగారం తమను ఆదుకుంటుందని ఎక్కువగా పసిడి..

Gold-Silver Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. స్థిరంగా కొనసాగుతున్న వెండి..
Gold And Silver
Follow us
Surya Kala

|

Updated on: Sep 24, 2021 | 7:05 AM

Gold-Silver Price Today: పూర్వకాలం నుంచి భారత దేశంలోని ప్రజలు బంగారాన్ని ఒక ఆస్తిగా భావిస్తారు. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో బంగారం తమను ఆదుకుంటుందని ఎక్కువగా పసిడి కొనుగోళ్ళకు ఆసక్తిని చూపిస్తారు. అందుల్లనే బంగారంపై వివిధ రూపాయల్లో పెట్టుబడి పెడతారు. ముఖ్యంగా వివాహం, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. విలువైన లోహాన్ని నగలు, నాణేలుగా విక్రయిస్తారు. ఆభరణం లోహం ప్రధానంగా వ్యక్తిగత వినియోగం కోసం ఉపయోగించబడుతుంది. గత వారం రోజుల నుంచి బంగారం ధరలు పైకీ, కిందకు కదులుతున్నాయి. ధరల్లో స్థిరత్వం ఏర్పడలేదు. ఒకరోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతూ.. అస్థిరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పసిడి, వెండి లోహాలు పెట్టుబడి రూపంగా కూడా చూడబడుతుంది. స్వల్ప , దీర్ఘకాలం పాటు పెట్టుబడులకు అనువైన లోగా పరిగణిస్తున్నారు.

బంగారం రేట్లు ద్రవ్యోల్బణం అంతర్జాతీయంగా ధరలు మార్పు, కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, వడ్డీ రేట్లు నిలకడలేని, నగల మార్కెట్లు సహా అనేక అంతర్జాతీయ అంశాలపై ప్రభావం ఇవి గ్లోబల్ గోల్డ్ రేట్లు ఆధారపడి ఉంటుంది. ఈరోజు (సెప్టెంబర్ 24వ తేదీ)  తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు పసిడి ధర కొంతమేర దిగిరాగా.. వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది.

భారత్‌లో బంగారం ధర ఈ రోజు (సెప్టెంబరు 24) తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ భారత మార్కెట్‌లో రూ.45,300 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.46,300 గా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో పోలిస్తే.. కొంతమేర పసిడి ధర తక్కువగా ఉండడం విశేషం.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాము నిన్నటి ధర 4,435లు ఉండగా రూ.6 తగ్గి ఈరోజు గ్రాము బంగారం ధర రూ. 4,530లకు చేరుకుంది. ఇక 10గ్రాముల బంగారం ధర నిన్న రూ. 44,350 ఉండగా రూ. 60 తగ్గి రూ. 45,300లకు చేరుకుంది.  మరోవైపు 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర నిన్న రూ. 4,636లు ఉండగా రూ.6మేర తగ్గి ఈరోజు 4,630లకు చేరుకుంది. ఇక 10 గ్రాముల బంగారం ధర నిన్నటి ధర రూ,46 360 లు ఉండగా ఈరోజు రూ. 60 ల మేర తగ్గి ఈరోజు ఉదయానికి రూ. 46,300 నమోదైంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడలో కొనసాగుతున్నాయి.

ప్రధాన నగరాల్లోని పసిడి ధరలు:

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో స్వల్పంగా పసిడి ధరలు పెరిగాయి. ఇక వెండి ధరకూడా అదే బాటలో పయనించింది. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,300ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,300గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,880 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,870గా ఉంది.

వెండి ధరలు:  దేశ వ్యాప్తంగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక్క ముంబై లో మాత్రమే కొంతమేర ధర పెరింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అన్ని ప్రధాన నగరాల్లో కంటే వెండి ధర కొంతమేర అధికంగా ఉంది. ముంబయి మార్కెట్‌లో కిలో వెండి  వెండి ధర రూ.60,600గా ఉండగా.. హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర కాస్త ఎక్కువగా రూ.65,100 గా స్థిరంగా ఉంది.  తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశివారు కొత్త ఆభరణాలు కొనుగోలు చేస్తారు.. ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..