Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: సరికొత్త రికార్డు సృష్టించిన స్టాక్ మార్కెట్.. 60 వేల పాయింట్ల ఎగువన సెన్సెక్స్..

Stock Market Today: ఇండియా స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. బుల్ తన జోరును కొనసాగిస్తూ.. చరిత్రలోనే తొలిసారిగా బీఎస్ఈ...

Stock Market: సరికొత్త రికార్డు సృష్టించిన స్టాక్ మార్కెట్.. 60 వేల పాయింట్ల ఎగువన సెన్సెక్స్..
Stock Market
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 24, 2021 | 11:54 AM

ఇండియా స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. బీఎస్ఈ సెన్సెక్స్(బుల్) తన జోరును కొనసాగిస్తూ.. చరిత్రలోనే తొలిసారిగా 60 వేల మార్క్ ఎగువకు చేరింది. అలాగే నిఫ్టీ కూడా 18 వేల మార్క్‌కు చేరువలో ఉంది.  నిన్న మార్కెట్ ముగిసే టైంకు సెన్సెక్స్ 59,885 పాయింట్స్‌ దగ్గర ముగియగా.. ఇవాళ ఉదయం 273 పాయింట్స్ లాభంతో 60,230 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అలాగే నిన్న నిఫ్టీ 17,823 దగ్గర క్లోజ్ కాగా.. ఇవాళ మార్కెట్ ప్రారంభం కాగానే 100 పాయింట్లు పెరిగి 17 వేల 920కి దగ్గరకు వచ్చింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 355 పాయింట్ల లాభంతో 60,241 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అటు నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 17,921 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. టాటా మోటార్స్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, విప్రో, ఎల్ అండ్ టీ షేర్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

ఆసక్తికరమైన విషయమేంటంటే.. బీఎస్ఈ సెన్సెక్స్ 50 వేల నుంచి 60 వేల పాయింట్ల మార్క్‌ను అందుకోవడానికి కేవలం 245 రోజులు పట్టింది. గతంలో సెన్సెక్స్ 40 వేల మార్క్ నుంచి 50 మార్క్‌ను అందుకోవడానికి సుమారు 597 రోజులు పట్టగా.. ఆ సమయం కంటే ఈసారి తక్కువ వ్యవధిలోనే 60 వేల పాయింట్లను క్రాస్ చేసి హయ్యస్ట్ బెంచ్ మార్క్‌కు రీచ్ అయింది. కరోనా సమయంలోనే 50 వేలు, 60 వేల బెంచ్ మార్క్‌ను బీఎస్ఈ సెన్సెక్స్ అందుకోగా.. భారత ఆర్ధిక వ్యవస్థకు ఇది మంచి పరిణామం అని బిజినెస్ నిపుణులు అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు అవలంభించిన సులువైన లిక్విడిటీ పాలసీ కారణంగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దేశీయ మార్కెట్‌లో పెట్టుబడులు పెరగడం, కేంద్రం చేపట్టిన నిరంతర సంస్కరణలు 30-స్టాక్ బెంచ్‌మార్క్ ఈ మైలురాయిని సాధించడంలో సహాయపడ్డాయి. గ్లోబల్ మార్కెట్ మద్దతుతో ప్రభుత్వం తన సంస్కరణలు కొనసాగిస్తే.. రెండు లేదా మూడు సంవత్సరాల్లో సెన్సెక్స్ 60,000 నుండి 1 లక్ష పాయింట్స్ వరకు చేరుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

నీళ్లలో కదులుతున్న పెద్ద ఆకారం.. వల వేసి చూడగా ఫ్యూజులు ఔట్.. వీడియో చూస్తే షాకవుతారు!

ఒకే మ్యాచ్‌లో అన్నదమ్ముల విధ్వంసం.. ఒకరు అర్ధ శతకం, మరొకరు డబుల్ సెంచరీ.. ఇంతకీ ఆ ప్లేయర్స్ ఎవరంటే.!

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!

Sensex