Viral Video: గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!

Elephant Viral Video: భారీ ఆకారం, శక్తి సామర్ధ్యాలు కలిగిన గజరాజుకు కోపం వస్తే ఇంకేమైనా ఉందా.! విధ్వంసం చూడాల్సిందే. బీభత్సం జరుగుతుంది...

Viral Video: గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!
Elephant
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Sep 23, 2021 | 5:51 PM

భారీ ఆకారం, శక్తి సామర్ధ్యాలు కలిగిన గజరాజుకు కోపం వస్తే ఇంకేమైనా ఉందా.! విధ్వంసం చూడాల్సిందే. బీభత్సం జరుగుతుంది. ఏనుగును చూస్తే అడవికి రాజైన సింహం కూడా బెదిరిపోవాల్సిందే. ఏ జంతువుతోనైనా ఏనుగు ధీటుగా పోరాడగలదు. అయితే అప్పుడప్పుడూ గజరాజులు వేటగాళ్లకు చిక్కుతూ ప్రాణాలు కోల్పోతుంటాయి. ఏనుగులకు మనసు, మానవత్వం ఉంటుందని అందరూ అంటుంటారు. అంతటి దయగల ఏనుగులకు కోపం వస్తే.. వాటిని ఆపడం ఎవరితరం కాదు. ఇటీవల దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం పదండి..

సామాజిక మాధ్యమాల్లో తరచూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా అడవి జంతువులకు సంబంధించినవే ఉంటాయి. వీటిపై నెటిజన్లు కూడా ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు. అడవిలో ఎప్పుడు.? ఏం జరుగుతుందో.? ఎవ్వరూ అంచనా వేయలేరు. అక్కడ జరిగే దృశ్యాలు అందరినీ థ్రిల్ చేస్తాయి. అలాంటి ఓ వీడియో గురించి మాట్లాడుకుందాం..

ఈ వీడియోలో ఓ అడవి దున్న సేద తీరుతున్న మీరు చూడవచ్చు. అయితే అప్పుడే అకస్మాత్తుగా ఓ మగ ఏనుగు అక్కడికి వస్తుంది. దానిపై మెరుపు దాడికి దిగుతుంది. ఆ అడవి దున్నను తొండంతో విసిరేయడమే కాకుండా.. కుమ్మేస్తుంది. గజరాజుకు కోపం వస్తే ఇంతేనేమో అన్నట్లుగా చిన్న సైజు విధ్వంసం జరుగుతుంది. పాపం.! ఏనుగు కుమ్ముడికి ఆ అడవి దున్న ప్రాణాలు వదులుతుంది. ఈ పోరుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

అయితే మరో వీడియోలో ఇంకో అడవి దున్న.. ఏనుగుతో పోటీకి దిగుతున్నట్లు మీరు చూడవచ్చు. కొమ్ములతో ఏనుగును పొడుస్తూ.. దానికి సమవుజ్జీగా నిలుస్తుంది. కొన్ని సందర్భాల్లో మగ ఏనుగులు ఇలా దూకుడుతనాన్ని ప్రదర్శిస్తాయని అంటున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోలపై ఓ లుక్కేయండి..

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?