Viral Video: గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

Viral Video: ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైపోయింది. ప్రపంచం నలమూలల జరిగిన వింతలూ-విశేషాలన్నీ కూడా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి..

Viral Video: గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!
Planes Crash
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Sep 23, 2021 | 5:18 PM

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైపోయింది. ప్రపంచం నలమూలల జరిగిన వింతలూ-విశేషాలన్నీ కూడా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు పాత వీడియోలు సైతం తెగ హల్చల్ చేస్తుంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీనిని చూసిన తర్వాత ఒక్కసారి మీ వెన్నులో వణుకు పుడుతుంది.

సాధారణంగా విమాన ప్రయాణాలు చేయడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. అయితే ఆకాశం మధ్యలో ఉన్నప్పుడు విమానంలో సాంకేతిక లోపం తలెత్తితే.. ఏం అవుతుంది.? ఈ ఊహే వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది కదా.! సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. కొంతమంది ప్రయాణీకులు స్కైడైవింగ్ చేయడానికి ఆకాశం మధ్యలోకి వెళ్లగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అంతే మొత్తం సినిమా సీన్ తలపించేలా షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.

ఈ సంఘటన 2013వ సంవత్సరంలో చోటు చేసుకుంది. రెండు స్కైడైవింగ్ విమానాలు ఆకాశంలో ఎగురుతున్నాయి. ఇంతలో ఒకదానిలో సాంకేతిక లోపం తలెత్తింది. అంతే మొత్తం రభస అయిపోయింది. ఆ విమానం అదుపు తప్పింది. పక్కనే ఉన్న మరో విమానంపైకి దూసుకొచ్చింది. రెండూ ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. అయితే రెండు విమానాల్లో ఉన్న ప్రయాణీకులు ప్యారాచూట్స్ సహాయంతో తమ ప్రాణాలను కాపాడుకోవడానికి దూకేశారు. ఈ ఘటనలో ఒక విమానం నేలపై కూలిపోగా.. మరొకదానిని పైలట్ చాకచక్యంగా నడిపి సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారింది.

విండ్ షీల్డ్ విరిగిపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని.. విమానం అదుపుతప్పి మరోదాని పైకి దూసుకొచ్చిందని ఓ పైలట్ వివరించాడు. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!